Akhil Akkineni Agent: అక్కినేని యంగ్ హీరో అఖిల్ వైజాగ్‌లో ఫైటింగ్ చేస్తున్నారు. అఖిల్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఏజెంట్’. అనిల్ సుంకర ఏకే ఎంట ర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పతాకాలపై రామబ్రహ్మాం సుంకర ‘ఏజెంట్’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వైజాగ్‌లో ప్రారంభం కానుంది. వైజాగ్ పోర్టులో యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారు. మలయాళ హీరో మమ్ముట్టీ ‘ఏజెంట్’ చిత్రం లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ముంబై మోడల్ సాక్షీ వైద్య ‘ఏజెంట్’ చిత్రంతో టాలీవుడ్ ఏంట్రీ ఇస్తున్నారు. ‘ఏజెంట్’ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Akhil Akkineni Agent: పోర్టులో పోరు
Akhil Akkineni Agent shoot happening in vizag
Leave a comment
Leave a comment