Ramayana: బాలీవుడ్లో ప్రజెంట్ ‘రామాయణ’ సినిమా పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ సినిమా (Ramayana) నుంచి ఇద్దరు నిర్మాతలు, ఓ దర్శకుడు తప్పుకున్న విషయం కూడా బాలీవుడ్లో చర్చనీయాంశమైంది.
నిర్మాత అల్లు అరవింద్, మధుమంతెన, నమిత్ మల్హోత్రాలకు కలిసి ‘రామాయణ’ సినిమా భారీ బడ్జెట్‌తో ట్రయాలజీగా నిర్మించనున్నారని 2018 నుంచే వార్తలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లోని లొకేషన్స్‌లో స్పెషల్ చిత్రీకరణ జరిపేలా ఈ నిర్మాతలు అప్పట్లో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ప్రాధమిక ఒప్పందం కూడా కుదుర్చు కున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఎవరు హిందీ ‘రామాయణ’ సినిమాకు దర్శకత్వం వహిస్తారు? అనే అంశంపై మాత్రం క్లారిటీ రాలేదు.
హిందీ ‘రామాయణ’ సినిమాకు ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి, రవి ఉదయార్లు కలిసి దర్శకత్వం వహిస్తా రని, అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాలు కలిసి నిర్మిస్తారని 2019లో అధికారిక ప్రకటన వచ్చింది. అప్పట్నుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి.
ఓ దశలో అంటే కరోనా ఫస్ట్‌వేవ్ పూర్తయిన తర్వాత ‘రామాయణ’ సినిమా ఆగిపోయిందనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ 2022లో ‘రామాయణ’ సినిమా ఆగిపోలేదని, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయని అల్లు అరవింద్ ఓ సందర్భంగా స్వయంగా వెల్లడించారు.
ఏడాదిన్నర నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి అని అల్లు అరవింద్ చెప్పడంతో అప్పట్నుంచి హిందీ ‘రామాయణ’ సినిమాలో ఎవరు రాముడిగా నటిస్తారు? సీత ఎవరు? అనే ఊహాగానాలు రావడం, వివిధ నటీనటుల పేర్లు తెరపైకి రావడం జరిగింది. ఈ పేర్లలో రామ్‌చరణ్, మహేశ్‌బాబు, రణ్‌వీర్‌సింగ్, రణ్‌బీర్‌కపూర్ వంటి పేర్లు వినిపించాయి.
LoveGuru Movie Review: విజయ్‌ఆంటోని లవ్‌గురు మూవీ రివ్యూ
తాజాగా ఇప్పుడు ‘రామాయణ’ సినిమాను గురించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయినట్లుగా వార్తలు వస్తు న్నాయి. ఈ నేపథ్యంలో రాముడిగా రణ్‌బీర్‌కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా నవీన్ పొలిశెట్టి,రావణుడిగా యశ్, కైకేయిలా లారా దత్తా, హనుమంతుడిగా దేవ్ దత్తా వంటి వార్ల పేరు తెరపైకి వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్ 17న శ్రీరామ నవమి సందర్భంగా ‘రామాయణ’ సినిమా అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని భాలీవుడ్ కబర్.
Geethanjali Malli Vachindi Review: గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా రివ్యూ
కానీ హిందీ రామాయణ సినిమాలో ప్రస్తుతం నిర్మాత అల్లు అరవింద్, మధుమంతెనల పేర్లు వినిపిం చడం లేదు. అలాగే దర్శకుడిగా రవి ఉదయార్ పేరు సైతం మాయమైంది. హిందీ ‘రామాయణ’ ట్రయాలజీని నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ మాన్స్టర్ మైండ్ క్రియే షన్స్ నిర్మిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బడ్జెట్ సపోర్ట్ కోసం హాలీవుడ్ నిర్మాణసంస్థ వార్నర్ బ్రదర్స్‌తో కూడా నమిత్ మల్హోత్రా చర్చలు జరుపుతున్నారట. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి నిర్మాతలుగా అల్లు అరవింద్, మధు మంతెనలు తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
హిందీ ‘గజిని’ సినిమా కోసం నిర్మాతలు అల్లు అరవింద్, మధుమంతెనలు కలిశారు. అయితే ఈ ఇద్దరు కలిసి డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌తో మహాభారతం ఆధారంగా ఓ సిరీస్ తీయాలనుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను తన ఇన్ స్టా అకౌంట్లో ఆల్మోస్ట్ అఫిషియల్‌గా ప్రకటించారు మధుమంతెన. అల్లు అరవింద్ ‘అల్లు ఎంటర్టైన్ మెంట్స్’కు ఇందులో భాగస్వామ్యం ఉంది.
రామాయణ నిర్మాణంలో అల్లు అరవింద్, మధుమంతెన, నమిత్మల్హోత్రాల మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని, అందుకే ఈ ప్రాజెక్ట్ నుంచి అల్లు అరవింద్, మధుమంతెనలు కలిసి ‘రామయణ’కు పోటీగా ‘మహాభారతం’ ఆలోచన చేశారని, ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చకపోవడంతో సైలెంట్ అయిపోయారనే గుసగుసలు బాలీవుడ్లో వినిపిస్తున్నాయి.
Maidaan Review: అజయ్‌దేవగన్ మైదాన్ రివ్యూ
ఈ ప్రశ్నలు అన్నింటికి సమాధానాలు దొరకాలంటే హిందీ ‘రామాయణ’ సినిమాను గురించిన పూర్తిస్థాయి అధికారిక ప్రకటన రావాల్సిందే.