సినిమా: గీతాంజలి మళ్లీ వచ్చింది
ప్రధానతారాగణం: అంజలి, సునీల్, శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, అలీ, రవిశంకర్, సత్య, సత్యం రాజేష్
దర్శకుడు: శివ తుర్లపాటి
నిర్మాతలు: కోనవెంకట్, ఎమ్వీవీ సత్యానారాయణ
కెమెరా: సుజాత సిద్దార్థ్
ఎడిటింగ్: చోటా కే ప్రసాద్
మ్యూజిక్: ప్రవీణ్ లక్కరాజు
జానర్: హారర్ కామెడీ (యూ బై ఏ సెన్సార్)
నిడివి: 2 గంటల 24 నిమిషాలు
విడుదల తేదీ: ఏప్రిల్ 11, 2024.
tollywoodhub.com Team Review 2.5/5
కథ
గీతాంజలి ని మానభంగం చేసి, హత్య చేస్తాడు రమేష్ (రావు రమేష్). అక్క గీతాంజలిని వెతుక్కుంటు వచ్చిన అంజలి నిజం తెలుసుకుంటుంది. చెల్లి అంజలి, ఆమె స్నేహితులు(శ్రీను (శ్రీనివాసరెడ్డి), ఆత్రేయ (షకలకశంకర్), ఆరుద్ర(‘సత్యం’ రాజేష్)) కలిసి రమేష్‌ను చంపేస్తుంది గీతాంజలి ఆత్మ. ఇది ‘గీతాంజలి’ తొలిభాగం కథ.
ఇక గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా కథ విషయానికి వస్తే…
తన తండ్రి (రమేష్) చావుకు కారణమైన అంజలి, ఆమె స్నేహితులను చంపి, వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు రమేష్ కొడుకు విష్ణు (రాహుల్ మాధవ్). ఓ పథకం ప్రకారం అంజలి, ఆమె స్నేహితులు శ్రీను (శ్రీనివాసరెడ్డి), ఆత్రేయ (షకలకశంకర్), ఆరుద్ర(‘సత్యం’ రాజేష్)లను సంగీత్మహాల్ అనే ఓ భూత్బంగ్లాకు చేర్చుతాడు విష్ణు. దర్శకుడు శ్రీను టీమ్‌లో కొత్తగా అయాన్(సత్య), కిల్లర్ నాని(సునీల్) జాయిన్ అవుతారు. ఇక సంగీత మహాల్లో దెయ్యాలుగా ఉన్న నటరాజశాస్త్రి (రవి శంకర్), ఆయన భార్య లక్ష్మి, కూతురు మోహినిలతో అంజలి అండ్ గ్యాంగ్‌ను చంపించాలన్నది విష్ణు ప్లాన్. మరి..విష్ణు ప్లాన్ ఫలించిందా? విష్ణు ప్లాన్‌ను అంజలి అండ్ టీమ్ ఎలా తెలుసుకుంది? నటరాజశాస్త్రి కుటుంబం సంగీత మహాల్‌లోనే ఎందుకు దెయ్యాలుగా ఉండిపోవాల్సి వచ్చింది? అన్న మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు థియేటర్స్‌లోనే చూడాలి.
విశ్లేషణ
గీతాంజలి ఆత్మ ఇంకా ఉందని చెప్పడం. ఓ పథకం ప్రకారం అంజలి, ఆమె స్నేహితులను ఊటీ లోని సంగీత్ మహాల్ లోకి విష్ణు ప్రవేశపెట్టడంతో తొలిభాగం ముగుస్తుంది. దెయ్యాలతో కలిసి సినిమా తీ
యాలని అంజలి, శ్రీనివాస్, ఆత్రేయ, ఆరుద్రలకు తెలియడం, ఈ విషయం తెలియని అయాన్, కిల్లర్
నాని దెయ్యాలైన నటరాజశాస్త్రితో కామెడీలు చేయడంతో సినిమా ముగింపుదశకు చేరుకుటుంది. విష్ణు గురించి అంజలి అండ్ టీమ్ నిజం తెలుసుకున్న తర్వాత గీతాంజలి ఆత్మ ఎంట్రీ ఇచ్చి, విష్ణును చంపడంతో సినిమా ముగుస్తుంది.
హారర్ కామెడీకి ప్రతీకారం అంశాన్ని జోడించాడు దర్శకుడు. కానీ ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ ఏవీ ఉండవు. అలా అని ప్రతీకారం పీక్స్‌లో ఉండదు. స్క్రీన్‌పై దెయ్యాలున్న అవి కూడా కామెడీకే. సినిమా అంతా మేజర్‌గా కామెడీగా ఉంటుంది. ముఖ్యంగా సత్య కామెడీ సినిమాను నిలబెడుతుంది. సెకండాఫ్‌లో ఏడుపులోని రకాలను సత్య చేసి, చూపిస్తున్నప్పుడు ఆ సీన్స్‌ను ఆడియన్స్ బాగా ఏంజాయ్ చేస్తారు. సేమ్..సునీల్, సత్య కాంబినేషన్లోని సీన్స్ ఆడియన్స్‌ను నవ్విస్తాయి. క్లైమాక్స్ చాలా పేలవంగా ఉంటుంది. కానీఇంట్రవెల్ ట్విస్ట్ బాగుంటుంది. మొత్తంగా హారర్ కామెడీ మూవీ గీతాజంలి మళ్లీ వచ్చింది లో కామెడీ మాత్రమే ఉంటుంది. హారర్ కూడా ఉంటే బాగుండేది. అలాగే కథలో సబ్‌ప్లాట్స్ ఎక్కువ. అంజలికి రవితోపెళ్లి ఓ కథ. సినిమా టీమ్‌కు ఓ కథ. సత్యకు ఓ బ్యాక్‌స్టోరీ. అలీకి ఓ బ్యాక్‌స్టోరీ. నటరాజశాస్త్రి రవిశంకర్కుఓ బ్యాక్‌స్టోరీ. ఈ బ్యాక్స్టోరీలపై ఫోకస్ పెట్టి, మెయిన్స్టోరీపై ఫోకస్ తగ్గించినట్లున్నాడు దర్శకుడు, కథకుడు.
Manjummel Boys Telugu Review: మంజుమ్మల్ బాయ్స్ రివ్యూ
Maidaan Review: అజయ్‌దేవగన్ మైదాన్ రివ్యూ
అంజలి (అంజలి), రవి (నటుడు రవికృష్ణ) లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు. కానీ రవిని విలన్ రాహుల్ మాధవ్ ఘోరంగా హత్య చేస్తే, తనకెమీ పట్టనట్లు, ఏమీ జరగనట్లు, స్నేహితులతో కలిసి అంజలి సిని మా షూటింగ్స్‌లో పాల్గొనడం అనేది పెద్ద మైనస్. 2012 నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 8న ప్రేమవివాహం పేరుతో అమ్మాయిలను మోసం చేసే వారిని సంగీత మహాల్లో నటరాజశాస్త్రి కుటుంబం చంపుతు న్నట్లుగా చూపిం చారు. ఈ ఎపిసోడ్‌కు సరైన ముగింపు ఉండదు. తన చెల్లి (అంజలి) ఆపదలో ఉందని గ్రహించిన గీతాంజలి ఆత్మ, ఆమెను చేరుకోవాలనుకుంటుకుంటుంది. వెంకట్రావు (అలీ)కు తన చెల్లి ఊటీలోనే ఉందని చెబుతుంది గీతాంజలి. కానీ ఊటీలో ఎక్కడ ఉందో తెలియదు అని, వెంకట్రావును వెతకమని చెప్పడం మరింత హస్యాస్పదం. ఇక అమ్మవారి గుడిలో క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. అమ్మవారి దేవాలయంలోనే ఆత్మలు పోరాటం చేసుకోవడం అనేది ప్రేక్షకులకు ఒకింత మింగుడు పడని విషయం. ఇలా మరికొన్ని విషయాలు ఉన్నాయి.
LoveGuru Movie Review: విజయ్‌ఆంటోని లవ్‌గురు మూవీ రివ్యూ
నటీనటుల పెర్పార్మెన్స్
అంజలి పాత్రలో అంజలి చాలా సెటిల్డ్‌గా చేశారు. యాక్టింగ్‌కు పెద్ద స్కోప్ లేదు. అయాన్ పాత్రలో సత్య రెచ్చిపోయాడు. ఈ సినిమాలో ఉన్న కామెడీ అంతా సత్య పాత్రతోనే ఉంటుంది. సెకండాఫ్‌లో సత్య, సునీల్ కాంబినేషన్లోని సీన్ కూడా నవ్విస్తుంది. కెమెరామేన్ నాని పాత్రలో వింటేజ్ సునీల్ స్టైల్ ఆఫ్ కామెడీ కనిపిస్తుంది. దర్శకుడు శ్రీను పాత్రలో శ్రీనివాసరెడ్డి, ఆత్రేయ పాత్రలో ‘సత్యం’ రాజేష్, ఆరుద్ర పాత్రలో ‘షకలక’ శంకర్లు చేశారు. షకలకశంకర్ పాత్రకు ఒకటి రెండు బాలయ్య స్ఫూప్‌లు పెట్టారు. నటరాజశాస్త్రిగారవిశంకర్ పాత్ర ఒకే. విలన్ విష్ణు పాత్రలో రాహుల్మాధవ్ బాగా నటించారు. కానీ ఈ పాత్ర ఎక్స్ప్రెషన్స్,డైలాగ్స్కే పరిమితం. విష్ణు పీఏ గోవిందాగోవిందంగా శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర ఉంటుంది. కొన్నిచోట్ల కామెడీ ట్రై చేశారు ఈ పాత్రతో. కానీ వర్కౌట్ కాలేదు.
కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. అనుభవలేమి స్పష్టంగా కని పిస్తుంది. కోనవెంకట్ స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఒకే. కానీ ఇది కామెడీ వరకే పరిమితమైంది. ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ ఒకే. సినిమాలపై వచ్చే రెండు సాంగ్స్ బాగున్నాయి. ఆర్ఆర్ ఇంకాస్త బాగుండాల్సింది. నిర్మాణ విలువలు ఒకే. ఎడిటింగ్ ఇంకాస్త చేయవచ్చు. ముఖ్యంగా నటరాజశాస్త్రి ఏపిసోడ్‌ను తగ్గించి ఉండొచ్చు.