సినిమా: మైదాన్ (Maidaan Review)
నటీనటులు: అజయ్‌దేవగన్, ప్రియమణి, రుద్రానిల్ ఘోస్, బహరూల్ ఇస్లామ్, దేవయాన్ష్ త్రిపాఠి, చైతన్యశర్మ, రవిశంకర్, అమర్త రాయ్
దర్శకత్వం: అమిత్‌శర్మ
నిర్మాణం: జీస్టూడియోస్, ఫ్రెష్‌లైమ్ ఫిలింస్, ఆకాష్ చావ్లా, అరుణవరాయ్ సేన్‌గుప్తా, బోనీకపూర్
సంగీతం: ఏఆర్ రెహమాన్
కెమెరా: తుషార్ రాయ్, ఫోడోర్ల్యాస్(స్పోర్ట్స్)
ఎడిటింగ్: దేవ్‌రావ్ జాదవ్, షేహవాన్జ్ మోసాని(స్పోర్స్ విజువల్స్)
విడుదల తేదీ: 11 ఏప్రిల్ 2024
జానర్: స్పోర్ట్స్ అండ్ బయోజిక్ (పుట్‌బాల్, సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్)
నిడివి: 181 నిమిషాలు
Tollywoodhub.com Team Review Rating: 3/5
కథ
ఒలింపిక్స్, ఆసియన్ గేమ్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టును విజేతగా నిలిపి, దేశ ఖ్యాతిని, దేశంలో ఫుట్‌బాల్ ఆట ప్రగతిని పెంచాలనుకుంటాడు సయ్యద్ అబ్దుల్ రహీమ్. కానీ 1952లో హెల్సెన్కీ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాట్ జట్టు ప్రత్యర్థి చేకోస్లేవియాపై 10–1 తేడాతో ఘోరంగా ఓడిపోతుంది. దీం తో భారత ఫుట్‌బాల్ జట్టును ప్రక్షాళన చేసి, మెరికల్లాంటి కొత్త కుర్రాళ్లను జట్టు చేర్పించాలని సయ్యద్ నిర్ణయించుకుంటాడు. అలా కొత్త జట్టుకు రూపకల్పన చేసి, 1956లో జరిగిన మెల్బోర్న్ ఒలింపిక్స్ భారతజట్టు హోమ్ టీమ్ ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధిస్తుంది. కానీ క్వార్టర్స్‌కు అర్హత సాధించలేక పోతుంది. 1960లో రోమ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లోనూ భారత ఫుట్‌బాల్ జట్టును నిరాశే ఎదురవుతుంది. దీంతో భారతఫుట్బాల్ జట్టు కోచ్‌గా సయ్యద్‌ను తీస్తేస్తారు ఫుట్‌బాల్ ఫెడరేషన్ సభ్యులు. ఇదే సమయంలో సయ్యద్‌కు లంగ్ క్యాన్సర్ అని వైద్యులు ధ్రువీకరిస్తారు. మరి..అంతర్జాతీయ టోర్నమెంట్స్‌లో భారతఫుట్బాల్ జట్టును విజేతగా నిలపాలన్న సయ్యద్ కల నెరవేరిందా? 1962లో జరిగిన ఆసియన్ గేమ్స్లోభారత ఫుట్‌బాల్ జట్టు ఎలా పెర్ఫార్మ్ చేసింది? ఫుట్‌బాల్ గేమ్‌యే జీవితంగా బతికిన సయ్యద్ వ్యక్తిగత జీవితం ఎలా గడిచింది? అన్నదే ఈ చిత్రం మిగిలిన కథాంశం
విశ్లేషణ
భారత ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తీశారు. కానీ సయ్యద్ పూర్తి జీవితం ఇందులో కనిపించదు. ఆయన భారత ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా ఉన్న 1950–1962 మ«ధ్య సమయంలోనే ‘మైదాన్’ సినిమా కథనం సాగుతుంది. చెప్పాలంటే ‘మైదాన్’ కథ మొదలైయ్యేదే ఫిన్లాండ్ రాజధాని హెల్సెన్కీలో జరిగే సమ్మర్ ఒలిపింక్ గేమ్స్‌తోనే (1952). హెల్సెన్కీ, మెల్బోర్న్, రోమ్ ఒలింపిక్స్, కోచ్‌గా సయ్యద్‌ను తీసేయ్యడం వంటి అంశాలతో తొలిభాగం ముగుస్తుంది. అయితే మెల్బోర్న్లో భారత ఫుట్‌బాల్ జట్టు హోమ్ టీమ్‌పై విజయం సాధించే మూమెంట్స్ హై ఇస్తాయి. ముఖ్యంగా మ్యాచ్ తర్వాత జరిగే ప్రెస్‌మీట్ ఇండియన్ ఆడియన్స్‌కు భలే కిక్ ఇస్తుంది.
సయ్యద్ మరోసారి భారత ఫుట్‌బాల్ కోచ్‌గా రావడం, 1962లో జకర్తా వేదికగా జరిగిన నాలుగో ఆసియన్ గేమ్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టుకు ఎదురైన వ్యతిరేక సవాళ్లు, టోర్నమెంట్లో భారత ఫుట్జట్టు పెర్ఫార్మెన్స్ అన్న అంశాలతో సినిమా కథనం ముగుస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే చివరి 40 నిమిషాలు అయితే సినిమా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఎక్కడ బోర్ కొట్టదు. ఓ టోర్న్‌మెంట్‌లో æహైలైట్స్ చూస్తున్న మాదిరి అన్నీ హై మూమెంట్స్ సినిమాలో ఉంటాయి.
భారతదేశంలో ఫుట్‌బాల్ గేమ్ అభివృద్ధికి సయ్యద్ ఏ విధంగా కంట్రిబ్యూట్ చేశాడు అన్న పాయింట్‌నే కథాంశంగా తీసుకుని దర్శకుడు సగం సక్సెస్ అయిపోయాడు. సయ్యద్ బాల్యం, అతని కుటుంబం, వివా హం వంటి వివరాల పరంగా వెళ్లలేదు. గేమ్‌పైనే ఫోకస్ పెట్టాడు. స్క్రీన్ ప్లే కాస్త రోటిన్ టెంప్లెట్లో ఉన్నా కథనంలో బోర్ కొట్టనివ్వలేదు. ఒలింపిక్స్ నుంచి మరో ఒలింపిక్స్ జరగడానికి నాలుగు సంవత్సరాలు పడుతుంది. ఈ మధ్యలో ఏం జరిగింది? అనే సోదీ లేకుండా డైరెక్ట్‌గా గేమ్‌లోకి వెళ్లిన తీరు బాగుటుంది.
అయితే ఫుట్‌బాల్ గేమ్‌ను గురించి…అంటే స్ట్రైకర్, మిడ్ఫార్వర్డ్, డిఫెన్స్, గోల్‌కీపర్ వంటి అంశాలపై అంత అవగాహనలేని ఆడియన్స్‌కు ఈ సినిమా నచ్చుతుంది. ఎందుకంటే దర్శకుడు ఎమోషన్స్‌పైనే దృష్టిపెట్టాడు. ఫుట్‌బాల్ గేమ్‌ను గురించి ఆడియన్స్‌కు క్లాస్ పీకాలనుకోలేదు. ఆడియన్స్కుఫుట్బాల్ నేర్పించాలనుకోలేదు. కానీ సెకండాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కాస్త స్లోగా నడుస్తుంది సినిమా. అలాగే తొలిభాగం కాస్త ప్లాట్‌గా ఉంటుంది. కానీ బోర్ కొట్టదు.
నటీనటులు
సయ్యద్ జీవితంలో జీవించాడు అజయ్‌దేవగన్. పెద్ద పెద్ద డైలాగ్స్ లేకపోయిన ఎక్స్‌ప్రెషన్స్‌లో యాటి ట్యూడ్, అవసరమైనప్పుడు ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ చూపించాడు. తొలిభాగంలో వచ్చే ప్రెస్‌మీట్ సీన్,భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్లో జరిగే తొలి మీటింగ్‌లో అజయ్ యాటిట్యూట్ ఉంటుంది. అలాగే తన కొడుకును జట్టు నుంచి తప్పించినప్పుడు, వారి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ భలేగా ఉంటుంది. అజయ్ఏ స్థాయి నటుడో చూపిస్తుంది. ఇక అజయ్‌దేవగన్ భార్య సారాగా ప్రియమణి పాత్రకు పెద్ద యాక్టింగ్ స్కోప్ లేదు. కానీ సెకండాఫ్‌లో అజయ్‌దేవగన్‌ను మెటివేట్ చేసే సీన్లో ప్రియమణి ఎమోషనల్ యాక్టింగ్ మెప్పిస్తుంది.
బెంగాల్ వ్యాపారవేత్త, ఓ పత్రికా అధినేత రాయ్ చటర్జీగా, విలన్‌గా గజ్రాజ్ నటన బాగుటుంది. ఇండియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సుభంకర్ గా చేసిన రుద్రానిల్ ఘోస్, మాజీ ప్రెసిడెంట్ అంజాన్‌గా చేసిన బహరూల్ ఇస్లామ్ బాగా చేశారు. సయ్యద్ కొడుకు రహీమ్‌గా దేవయాన్ష్ త్రిపాఠి, ఫుట్‌బాల్ ప్లేయర్స్ పీకే బెనర్జీగా చైతన్యశర్మ, గోల్‌కీపర్ త్యాగరాజ్గా రవిశంకర్, స్ట్రైకింగ్ ప్లేయర్ చున్నిగోస్వామిగా అమర్తరాయ్లకు మంచి రోల్స్ పడ్డాయి.
‘మైదాన్’ సినిమా సాంకేతిక విభాగం స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ విభాగాన్ని మెచ్చుకోవాలి. ఫోడాల్యాస్ గేమ్ విజువల్స్ అదుర్స్. తుషార్ రే సినిమాటోగ్రఫీ ఒకే. జీ స్టూడియోస్, బే వ్యూ ప్రొజెక్ట్స్, ఫ్రెష్‌లైమ్ ఫిలింస్ల నిర్మాణ విలువలు బాగుంటాయి. దేవ్రాజ్జాదవ్, మోసాని ఎడిటింగ్ బాగుంది. ఇక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, కొన్ని చోట్ల ఆర్ఆర్ బాగుంది. ముఖ్యంగా టీమ్ ఇండియా సాంగ్ ఆడియన్స్‌కు హై ఇస్తుంది.