‘కల్కి2898ఏడీ’ సినిమాలోని మహాభారతం పోర్షన్ సీన్స్‌లో విజయ్‌దేవరకొండ (vijaydevarakonda) అర్జునుడి పాత్రలో నటిం చారు. కానీ అర్జునుడి పాత్రలో విజయ్ చెప్పిన డైలాగ్స్ తెలంగాణ స్లాంగ్‌లో ఉన్నాయని, అర్జునుడి పాత్రకు విజయ్ ఏ మాత్రం సూట్ కాలేదని సోషల్‌మీడియాలో నెగటివ్ ట్రెండ్ నడిచింది. ఈ విషయం విజయ్ దేవర కొండవరకూ చేరింది. కానీ ఈ నెగటివిటీని తనదైన స్టైల్లో డీల్ చేశారు విజయ్(vijaydevarakonda). ‘కల్కి2898ఏడీ’ సినిమాలో తాను పోషించిన అర్జునుడి పాత్ర ఉన్న ఫోటోలను సోషల్‌మీడియాలోని తన అకౌంట్స్ హ్యాండిల్‌కు డీపీలుగా మార్చాడు. ఇలా తనను ట్రోల్ చేసిన వారికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.
vijaydevarakonda ఇదేం తొలిసారి కాదు..!
విజయ్‌దేరకొండ సినిమాలు, అతనిపై రీసెంట్ టైమ్స్‌లో ట్రోలింగ్ జరుగుతోంది. విజయ్ గత చిత్రం ‘ఫ్యామిలీస్టార్’ సమయంలో ‘ఐరనే వంచాలా ఏంటీ?’ అనే డైలాగ్‌కు బాగా ట్రోలింగ్ జరిగింది. సినిమా రిలీజ్ తర్వాత కూడా, కొన్ని సన్నివేశాలను ఉద్దేశించి ట్రోలింగ్ జరిగింది. ఈ ట్రోలింగ్‌ను ఆయుధంగా ప్రమోషన్స్‌కు వాడుకున్నాడు విజయ్‌దేవరకొండ. ఇప్పుడు ‘కల్కి2898ఏడీ’ విషయంలోనూ ఇదే చేశాడు. విజయ్‌లోని ఈ అగ్రెసిస్ ఇంటెంట్యే అతన్ని ఫ్యాన్స్‌లో రౌడీస్టార్‌ని చేసింది. విజయ్‌దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా ఈవెంట్లో ఓ రాజకీయ నేతను ఉద్దేశించి కౌంటర్ ఏటాక్ చేసిన విజయ్‌ని ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు.
విజయ్ తర్వాతి చిత్రాలు
విజయ్‌దేవరకొండ ప్రస్తుతం గౌతమ్తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. పోలీసాఫీసర్ లేదా స్పై పాత్రలో విజయ్‌దేవరకొండ నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావొచ్చింది. అలాగే తనకు గతంలో ‘టాక్సీవాలా’ వంటి హిట్ ఇచ్చిన రాహుల్ సంకృత్యాన్‌తో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమాచేయనున్నాడు విజయ్. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అలాగే రవికిరణ్ కోల డైరెక్షన్లో ఓ పక్కా విలేజ్ మాస్ డ్రామాకు విజయ్‌దేవరకొండ కమిటైయ్యాడు. ఈ సినిమా చిత్రీకరణ కూడా ప్రారంభం కావాల్సింది.