నరుడి బ్రతకు నటన
DjTilluBackgroundStory: నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో శ్రద్ధా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. దీంతో సితార బ్యానర్లోనే మరో సినిమా చేసే చాన్స్ శ్రద్ధాశ్రీనాథ్‌కు లభించింది. అలా సిద్దు జొన్నలగడ్డ, శ్రద్ధాశ్రీనాథ్లు లీడ్ రోల్స్‌లో ‘నరుడి బ్రతకు నటన’ అనే సినిమా అధికారిక ప్రకటన 2020 అక్టోబరులో వెల్లడైంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాకు దర్శకత్వం విభాగంలో పని చేసిన విమల్‌కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. కాలభైరవ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ (DjTilluBackgroundStory).
తప్పుకున్న శ్రద్ధాశ్రీనాథ్
Anupama Parameswaran: అనుపమ 2.ఓ…అభిమాని ఆవేదన
కారణాలు కచ్చితంగా తెలియకపోయిన ‘నరుడి బ్రతుకు నటన’ సినిమా నుంచి శ్రద్ధా శ్రీనాథ్ తప్పు కున్నా రు. ఈ చాన్స్ నేహాశెట్టికి దక్కింది. అలా సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టిల కాంబినేషన్లోనే 2021 జనవరి సమయంలో ‘నరుడి బ్రతకు నటన’ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణ బాగా ఆలస్యమైంది. ఈ లోపు దర్శకుడు విమల్‌కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమా స్క్రిప్ట్‌పై బాగా వర్క్ చేశారు.
త్రివిక్రమ్ జోక్యం
కానీ సడన్‌గా ఈ సినిమాపై ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ చూపు పడింది. ఎస్ రాధాకృష్ణ, సూర్యదేవర నాగ వంశీల హారిక అండ్హాసని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌లో వచ్చే సినిమాలకు త్రివిక్రమ్ సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ఆయన భార్య సాయిసౌజన్య పేరుతో ఈ ప్రాజెక్ట్‌లోకి ఆయన కూడా జోక్యం చేసుకున్నారు. కథ, సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టరైజేషన్‌కు త్రివిక్రమ్ చెప్పిన సూచనలు బాగా వర్కౌట్ అయ్యాయి. ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్ కాస్త ‘డీజే టిల్లు’గా మారింది.
మారిన సంగీతం
Tillu Square: డీజే టిల్లు 2 నుంచి తమన్ అవుట్
కానీ మ్యూజిక్ డైరెక్టర్‌గా కాలభైరవ తప్పుకున్నారు. శ్రీచరణ్ పాకాల వచ్చారు. అలాగే రామ్ మిరియాల కూడా డీజే టిల్లుకు కూడా ఓ పాటకు సంగీతం అందించి, పాడారు. అదే డీజేటిల్లు టైటిల్ సాంగ్. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటం టే….‘డీజేటిల్లు’ బ్యాగ్రౌండ్ స్కోర్ శ్రీచరణ్ పాకాల కానీ, రామ్ మిరియాల కానీ చేయలేదు. తమన్ చేశారు.
2021 డిసెంబరులో విడుదలైన ‘అఖండ’ సినిమాకు తమన్ ఇచ్చిన ఆర్ఆర్ బాగా వర్కౌట్ అయ్యింది. అలా ‘డీజేటిల్లు’కు తమన్ ఆర్ఆర్ అందించారు. అలా ఎటువంటి అంచనాలు లేకుండా 2022 ఫిబ్రవరి 12న విడుదలైన ‘డీజేటిల్లు’ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాదాపు 9 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్‌గా 30 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా ‘డీజే టిల్లు 2’ను ప్రకటించారు మేకర్స్.
Manjummel Boys Telugu Review: మంజుమ్మల్ బాయ్స్ రివ్యూ
ఎన్నో మార్పులు!
‘డీజేటిల్లు 2’ చిత్రం ప్రస్తుతం వందకోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్‌ను సాధించి, ఇంకా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అయితే ఈ సినిమా విషయంలో కూడా చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ‘డీజే టిల్లు 2’లో హీరోగా సిద్దు జొన్నలగడ్డయే చేశారు. కానీ హీరోయిన్గా అనుపమాపరమేశ్వరన్ నటించారు. నేహాశెట్టి ఓ గెస్ట్ రోల్లో కనిపిస్తారు.
Tillu Square Review: ‘టిల్లుస్క్వేర్’ రివ్యూ
అలాగే విమల్ కృష్ణ స్థానంలో ‘అద్భుతం’ ఫేమ్ మల్లిక్ రామ్ డైరెక్టర్‌గా వచ్చాడు. రామ్ మిరియాల, అచ్చు రాజమణిలు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్స్. తొలుత ‘డీజే టిల్లు 2’కు తమన్ ఆర్ఆర్ ఇవ్వాల్సింది. కానీ తమన్ స్థానంలో భీమ్స్ సిసిరోలియో ఆర్ఆర్ ఇచ్చారు. ఇలా మూడు రిలీజ్‌ల వాయిదాల తర్వాత ‘డీజే టిల్లు 2’ చిత్రం మార్చి 29, 2024న థియేటర్స్‌లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
FamilyStar Review: విజయ్‌దేవరకొండ ఫ్యామిలీస్టార్ రివ్యూ
డీజేటిల్లు క్యూబ్(డీజే టిల్లు 3)
‘డీజే టిల్లు’, ‘డిజే టిల్లు 2’ సినిమాలు విజయాలు సాధించడంతో ‘డీజే టిల్లు 3’ని ప్రకటించారు నాగవంశీ. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ ‘జాక్’, ‘తెలుసుకదా’ సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత ‘డీజే టిల్లు 3’ ఉండొచ్చు. లేకపోతే…‘డీజే టిల్లు 3’, ‘తెలుసు కదా’ సినిమాల చిత్రీకరణలు సమాంతరంగా జరిగేఅవకాశాలు ఉన్నాయి. ‘డీజేటిల్లు’, ‘డీజేటిల్లు 2’లకు రైటర్‌గా పని చేసిన సిద్దు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు 3’కికూడా రైటర్‌గా వర్క్ చేస్తాడని ఊహించుకోవచ్చు.