Tillu Square: రెండు సంవత్సరాల క్రితం ఫిబ్రవరిలో విడుదలైన సిద్దు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ సూపర్‌హిట్. ఈ చిత్రంలో నేహాశెట్టి హీరోయిన్. వంశీ కృష్ణ దర్శకత్వం వహించగా, సితార ఎంటర్టైన్మెంట్స్పై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. శ్రీచరణ్ పాకాల, రామ్ మిరియాల మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ సినిమాకు. తమన్ బ్యా గ్రౌండ్ స్కోర్ అందించారు.
‘డీజేటిల్లు’ సూపర్‌హిట్ కావడంతో ‘డీజేటిల్లు 2’ (Tillu Square) ను ప్రకటించారు మేకర్స్. హీరోగా సిద్దు జొన్నలగడ్డయే కన్ఫార్మ్. కానీ సీక్వెల్ ‘డీజేటిల్లు 2’లో హీరోయిన్ నేహాశెట్టి కాదు. అనుపమాపరమేశ్వరన్కు తీసుకున్నారు. దర్శకుడు కూడా మారాడు. తొలిపార్టుకు వంశీకృష్ణ డైరెక్టర్. కానీ సీక్వెల్‌కు ‘అద్భుతం’ ఫేమ్ మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. హీరోయిన్, డైరెక్టర్, తర్వాత ఇప్పుడు ‘డీజేటిల్లు’ సినిమాకు సంబంధించి తమన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
DJ Tillu2 నాలుగో రిలీజ్ డేట్‌ను ప్రకటించిన డీజేటిల్లు
డీజేటిల్లు 2 సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ‘ఓ మై లిల్లీ’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ‘డీజేటిల్లు 2’ సినిమాకు తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడం లేదని, అతని ప్లేస్‌లో భీమ్స్ సిసిరోలియో(రవితేజ ‘థమాకా’ ఫేమ్)ను తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఇతర ప్రాజెక్ట్స్‌తో తమన్ బిజీగా ఉండటం వల్లే ‘డీజేటిల్లు 2’కు భీమ్స్ సిసిరోలియో బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వాల్సి వచ్చిందన్నట్లుగా నాగవంశీ చెప్పుకొచ్చారు.
Anupama Parameswaran: అనుపమ 2.ఓ…అభిమాని ఆవేదన
ఇక ఈ సినిమాలో అనుపమాపరమేశ్వరన్ బోల్డ్ క్యారెక్టర్ చేయడం వల్ల కొన్ని విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై అనుపమాపరమేశ్వరన్ స్పందించారు. ఓ నటిగా తాను అన్నిరకాల పాత్రలు చేయాలనుకుంటున్నానని, ఇందులో భాగంగానే ‘డీజేటిల్లు 2’లో కాస్త బోల్డ్ పాత్రలో నటించానని చెప్పారు. అంతేకాదు.. ‘డీజేటిల్లు’ సినిమాలో తన పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉందని, ఇలాంటి ఓ పాత్రను నటిగా నేను వదులుకోవాలనుకోవడం లేదని అనుపమాపరమేశ్వరన్ చెప్పుకొచ్చారు.