DJ Tillu2: యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ కెరీర్‌ను అమాంతం బిజీ చేసిన సినిమా ‘డీజే టిల్లు’. 2022 ఫిబ్రవరిలో విడుదైలన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో
No caption, Only action! In Theatres all around you from 29th March 2024 🤩#TilluSquareOnMarch29th 🤟#TilluSquare #Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas @adityamusic pic.twitter.com/cpTUW9nto0
— TollywoodHub (@tollywoodhub8) January 26, 2024
ఈ సినిమా సీక్వెల్‌కు శ్రీకారం చుట్టూరు సిద్దు జొన్నలగడ్డ. వెంటనే ‘డీజే టిల్లు 2’ స్టార్ట్ చేశాడు. కాకపోతే తొలిపార్టుకు ఆర్ఎస్ విమల్ దర్శకుడు. ‘డీజేటిల్లు 2’కు ‘అద్భుతం’ ఫేమ్ మల్లిక్‌రామ్ డైరెక్టర్. తొలిపార్టులో నేహాశెట్టి హీరోయిన్గా నటించగా, మలిపార్టులో అనుపమాపరమేశ్వరన్ హీరోయిన్గా చేస్తున్నారు. ఈ సినిమాను తొలుత 2023 మార్చిలో విడుదల చేయాలనుకున్నారు. ఆ తర్వాత సెప్టెంబరు 15కి వాయిదా పడింది. ఈ నెక్ట్స్ 2024 ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు. తాజాగా ‘డీజేటిల్లు 2’ చిత్రం మార్చి 29న విడుదల కానున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఇలా ‘డీజేటిల్లు 2’కి ఇప్పటివరకు నాలుగు విడుదల తేదీలు వచ్చాయి. సూర్యదేవరనాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.