రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ సినిమా రెండు భాగాలుగా విడుదలై, బాక్సాఫీస్ వద్ద హిట్ ఫిల్మ్‌గా నిలిచింది. ‘బాహుబలి’ స్ఫూర్తితో ఆ తర్వాత చాలా సినిమాలు పార్టు 2గా మారాయి. ‘బాహుబలి’ స్పూర్తితోనే తాను ‘పొన్నియిన్ సెల్వన్’ను రెండు భాగాలుగా చేసి, విడుదల చేయగలి గానని మణిరత్నం వంటి గొప్ప దర్శకులు బహిరంగంగా చెప్పడం ఓ ఉదాహరణ. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ ప్రభాస్ (Prabhas) చేసే ప్రతి చిత్రం కూడా కథ పూర్తి కాకుండానే…పార్ట్ 2కు ఓ లీడ్‌గా మిగిలిపోవడం మాత్రం డార్లింగ్ (Prabhas) ఫ్యాన్స్‌కు నిరాశే.
Kalki2898adReview: ప్రభాస్ కల్కి2898ఏడీ రివ్యూ
‘సలార్’ విషయంలో ఇదే జరిగింది. ‘సలార్ 2’ను వెంటనే స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లడం అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభాస్ తాజా చిత్రం ‘కల్కి2898ఏడీ’ సినిమాకి కూడా పార్టు 2లోకి చేరిపోయింది. వినడానికి కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నా…‘ఆదిపురుష్’ సినిమాకు పార్ట్2 ప్లాన్ చేశారు. కానీ తొలిపార్టు వర్కౌట్ కాకపోవడంతో అది ఆగిపోయిందనే వార్తలు బాలీవుడ్లో ఉన్నాయి.ప్రభాస్ నుంచి వరుస సినిమాలు వస్తుండటం మాత్రం ఆయన ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే విషయం. అలాగేప్రభాస్ ప్రస్తుతం ‘రాజాసాబ్’ చేస్తున్నాడు. సందీప్‌రెడ్డి వంగా, హనురాఘవపూడిలతో ప్రభాస్‌కు కమిట్ మెంట్స్ ఉన్నాయి. మరి.. ఈ సినిమాలూ ఎలా ఉంటాయో చూడాలి. ఒకవేళ ఇవి కూడా పార్ట్ 2 అంటే మాత్రం ప్రభాస్ తన కథల ఎంపికపై మరింత ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది.