Familystar: విజయ్‌దేవరకొండ ‘ఫ్యామిలీస్టార్’ సినిమా ప్రస్తుతం థియేటర్స్‌లో ప్రదర్శించబడుతోంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమాకు హిట్ టాక్ రాకపోవడంతో అక్కినేని ఫ్యాన్స్ కొందరు సోషల్‌మీడియాలో ‘ఫ్యామిలీస్టార్’ సినిమా రిజల్ట్‌ని ట్రోల్ చేస్తున్నట్లుగా తెలు స్తోంది. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.
ఆగిపోయిన నాగేశ్వరరావు
హీరో విజయ్‌దేవరకొండ, పరశురామ్‌ల కాంబినేషన్లో 2018లో విడుదలై, బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి, వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన చిత్రం ‘గీతగోవిందం’. అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ ఉప సంస్థ జీఏ 2 పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది. అయితే ఇదే సంస్థలో పరశురామ్ మరో సినిమా చేయడానికి అప్పట్లో కమిట్ అయ్యాడట. కానీ ముందుగా నాగచైతన్యతో 14రీల్స్ ఫ్లస్‌లో ఓ సినిమాను స్టార్ట్ చేశాడు పరశురామ్. ఈ సినిమా హిందీ ‘ఛిచోరే’కు తెలుగు రీమేక్ అనే టాక్ కూడా వినిపిం చింది. ఈ సినిమాకు నాగేశ్వరరావు అనే టైటిల్‌ను అప్పట్లో పరిశీలించినట్లుగా వార్తలు కూడా వచ్చా యి. ఇంతవరకు బాగానే ఉంది.
గీతగోవిందం కాంబినేషన్ రిపీట్
FamilyStar Review: విజయ్‌దేవరకొండ ఫ్యామిలీస్టార్ రివ్యూ
కానీ ‘నాగేశ్వరరావు’ సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సిన సమయంలో మహేశ్‌బాబుతో సినిమా చేసే చాన్స్ పరశురామ్‌కు దక్కింది. మహేశ్‌బాబులాంటి పెద్ద హీరో, మైత్రీవంటి పెద్ద నిర్మాణసంస్థతో సినిమానుకాదనుకోలేకపోయారట పరశురామ్. దీంతో మహేశ్‌తో ‘సర్కారువారిపాట’ తీశాడు పరశురామ్. మహేశ్ ఆశించినంత రిజల్ట్ అయితే రాలేదు. ఈ సమయంలో గీతాఆర్ట్స్‌లో సినిమా చేయాల నుకున్నారట పరశురామ్. గీతాఆర్ట్స్ వారు నాగచైతన్యను హీరోగా అనుకున్నారట. ఏమైందో ఏమో కానీ…ఈ ప్రాజెక్ట్ ‘దిల్’ రాజు చేతిలోకి వెళ్లింది. ‘లైగర్’ సినిమా డిజాస్టర్‌గా నిలవడంతో నెక్ట్స్ మూవీ ప్రయత్నాల్లో ఉన్న విజయ్‌కు ‘ఫ్యామిలీస్టార్’ కథ వినిపించాడట పరశురామ్. అలా ‘ఫ్యామిలీస్టార్’ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. ఇప్పుడు రిజల్ట్ తేడా కొట్టడంతో ‘ఫ్యామిలీస్టార్’ సినిమా దర్శకుడు పరశురామ్‌ను పరోక్షంగా ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.
Manjummel Boys Telugu Review: మంజుమ్మల్ బాయ్స్ రివ్యూ
గీతాఆర్ట్స్‌లో తండేల్
మరోవైపు ప్రస్తుతం గీతాఆర్ట్స్‌లో తండేల్ సినిమా చేస్తున్నాడు నాగచైతన్య. ‘ప్రేమమ్’, ‘సవ్వసాచి’ చిత్రాల తర్వాత నాగచైతన్య, చందూమొండేటిల కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ‘లవ్ స్టోరీ’ తర్వాత సాయిపల్లవి, నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం కూడా ఇదే. ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదల కానుంది.