Telugu Manjummel Boys: మలయాళంలో ‘మంజుమ్మెల్ బాయ్స్’ బ్లాక్‌బస్టర్ కొట్టారు. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లను సాధించిన రికార్డు గతంలో ‘2018: ఏవ్రీ వన్ ఈజ్ ఏ హీరో’ సినిమా పేరిట ఉండేది. కానీ ఈ సినిమావసూళ్లను అధికమిస్తూ, ‘మంజుమ్మెల్ బాయ్స్’(Telugu Manjummel Boys) సరికొత్త రికార్డును సృష్టించారు. కేరళ వరదల ఆధారంగా రూపొందిన ‘2018’ చిత్రం దాదాపు 180 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిన సంగతి తెలిసిందే. తాజాగామంజుమ్మెల్ బాయ్స్ దాదాపు 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీ నెంబర్ 1 బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
2018ను దాటి…!
‘2018’ సినిమా 180 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది అంటే ఈ సినిమా తెలుగు కలెక్షన్స్ కూడా కీలకమే. దాదాపు 10 కోట్ల రూపాయలు ఈ సినిమాకు ఇచ్చారు తెలుగు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు మంజుమ్మెల్ బాయ్స్’ తెలుగులో ఏప్రిల్ 6న విడుదల కాబోతోంది. తెలుగులో ఓ అగ్రనిర్మాణసంస్థగా ఉన్న మైత్రీమూవీమేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తోంది.
ఇక తెలుగులో విడుదలై, అత్యధిక వసూళ్లను సాధించిన మలయాళ చిత్రంగా ఇటీవల విడుదలైన ‘ప్రేమలు’ సినిమాను చెప్పుకుంటున్నారు. మలయాళ ‘ప్రేమలు’ సినిమా తెలుగులో దాదాపు 15 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఈ రికార్డును అధిగమించాలి అంటే …తెలుగులో ‘మంజుమ్మెల్ బాయ్స్’ సూపర్‌డూపర్ హిట్ కావాలి. పైగా ‘ప్రేమలు’ సినిమా తెలుగులో హిట్ అయ్యిందంటే కారణం . ..ఈ సినిమాకు హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్ ఉండ టం. కానీ మంజుమ్మెల్ బాయ్స్ సినిమా బ్యాక్‌డ్రాప్ తమిళనాడు. మరి..ఈ సినిమాకు తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో చూడాలి. అయినా కంటెంట్ నచ్చితే డబ్బింగ్ సినిమాలకు కూడా డబ్బులు ఇవ్వడానికి తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ సిద్ధమే. గతంలో చాలా సార్లు ఇచ్చారు.
అడ్డుగా ఫ్యామిలీస్టార్
కానీ ‘మంజుమ్మెల్ బాయ్స్’ విడుదలకు ఒకరోజు ముందుగా అంటే …ఏప్రిల్ 5న తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీస్టార్’ రిలీజ్ అవుతోంది. ‘దిల్’ రాజు– శిరీష్‌లు నిర్మించారు. ‘గీత గోవిందం’ సినిమాతో విజయ్ దేవరకొండను తొలిసారి వందకోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్స్ క్లబ్లోకిచేర్చిన దర్శకుడు పరశురామ్ పేట్ల ‘ఫ్యామిలీస్టార్’ సినిమాకు దర్శకుడు. ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్. ఇలా ‘ఫ్యామిలీస్టార్’ పోటీని తట్టుకుని ‘మంజుమ్మెల్ బాయ్స్’ 15కోట్ల రూపాయలను తెలుగులో వసూలు చేయడం అంటే కాస్త కష్టమే.
Familystar: ఫ్యామిలీస్టార్…బడ్జెట్ పద్మనాభం గుర్తొచ్చారు!
సర్వైవల్ డ్రామా
‘2018’ సినిమాలానే ‘మంజుమ్మెల్ బాయ్స్’ కూడా సర్వైవల్ డ్రామా. 2006లో తమిళనాడు కోడైకెనాల్‌లోని గుణ కేవ్స్లో చిక్కుకుపోయిన తమ స్నేహితుడిని ఏర్నాకులం మంజుమ్మెల్ బాయ్స్ ఏ విధంగా రక్షించారు? అనే కోణంలో ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమా కథనం ఉంటుంది. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్బాసి ఈ సినిమాలోని ప్రధాన తారాగణం. బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోనీ మలయాళంలో ఈ సినిమాను నిర్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఈ చిత్రం మలయాళంలో విడుదలైంది.