Manjummel Boys: మలయాళ ఫిల్మ్ మంజుమ్మెల్ బాయ్స్ (Manjummel Boys)బాక్సాఫీస్ రికార్డులు సృష్టిస్తోంది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ సర్వైవల్ డ్రామా ఫిబ్రవరి 22న విడుదలైంది. తొలిరోజు నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. విడుదలైన 12 రోజుల్లోనే వందకోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది ఈ చిత్రం. మలయాళంలో టివినోథామస్ ‘2018: ఎవ్రీ వన్ ఈజ్ ఏ హీరో’, మోహన్‌లాల్ ‘లూసీఫర్’, çమోహన్‌లాల్ ‘పులిమురుగన్’ (తెలుగులో ‘మన్యం’ పులి) చిత్రాల ఇదివరకే వందకోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించాయి. తాజా ఈ జాబితాలోకి మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం చేరింది. మరో మలయాళ చిత్రం ‘ప్రేమలు’ కూడా వందకోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రం మార్చి 8న తెలుగులో విడుదల అవుతోంది. మరి..ప్రేమలు చిత్రం కూడా మలయాళ బాక్సాఫీస్ వద్ద వందకోట్ల మైలురాయిని చేరుకుం టుందా? లేదా అనేది చూడాలి.
ఓవర్సీస్లో కూడా ఈ చిత్రానికి బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం ఈ ఫీట్‌ను సాధించడానికి ముఖ్య కారణం తమిళనాడు కలెక్షన్స్. తమిళంలో విడుదలైన ‘ముంజుమ్మెల్ బాయ్స్’ చిత్రం సూపర్‌హిట్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ చిత్రం ఇంకా థియేటర్స్‌లో ప్రదర్శితం అవుతోంది. ఓవర్సీస్ రెస్పాన్స్, తమిళనాడులో లాంగ్ రన్, కేరళ బ్లాక్‌బస్టర్ లాక్ ఇలానే కొనసాగితే ‘మంజుమ్మెల్ బాయ్స్’ సులభంగా మలయాళ ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం 2018 చిత్రం 180 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌తో మలయాళ బాక్సాఫీస్ వద్ద టాప్ పోజిషన్లో ఉంది. మరి..2018 సినిమాను మంజుమ్మెల్ బాయ్స్ ఓవర్టేక్ చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అలాగే ఈ సినిమాను ఇతర భాషల్లోనూ అనువదించి విడుదల చేయాలనుకుంటున్నారు. మార్చి నెలలోనే తెలుగులోనూ విడుదల చేయాలనుకుంటున్నారు మేకర్స్ ఈ సినిమాను. 2018 సినిమాను బన్నీ వాసు తెలుగులో అనువదించి తెలుగురాష్ట్రాల్లో విడుదల చేస్తే ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సో.. మంజుమ్మెల్ బాయ్స్ తెలుగులో విడుదలైతే వసూళ్లు మరింత పెరుగుతాయి. పైగా..2018, మంజుమ్మెల్ బాయ్స్…ఈ రెండు చిత్రాలు సర్వైవల్ డ్రామాసే కావడం విశేషం.
ఇటీవల విడుదలైన మలయాళ చిత్రాలు వరుసగా బ్లాక్‌బస్టర్ టాక్‌ను తెచ్చుకున్నాయి. మమ్ముట్టీ ‘భ్రమయుగం’, ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్..ఇలా మూడు సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి.
మంజుమ్మెల్ బాయ్స్ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ తీసిన దర్శకుడు చిదంబరం కు కోలీవుడ్, టాలీవుడ్ల నుంచి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉండగానే చిదంబరం నెక్ట్స్ చిత్రం ధనుష్‌తో ఉంటుందనే టాక్ కోలీవుడ్‌లో మొదలైంది.