TollywoodHero: ఏజెంట్ మిషన్ ఫెయిల్
దక్షిణాది హీరో, హీరోయిన్స్ ఎవరైనా బాలీవుడ్లో సక్సెస్ కావాలనుకుంటున్నారు. ఈ దిశగా ఎప్పటి కప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇటీవల కొందరు కుర్ర హీరోలు పాన్ ఇండియా సినిమా అంటూ ప్లాప్ అయ్యారు. ‘ఏజెంట్’ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అక్కినేని యువ హీరో అఖిల్. మలయాస్టార్ హీరో మమ్ముట్టీని ఈ సినిమాలో ఓ లీడ్ రోల్ చేశారు. భారీ బడ్జెట్‌తో అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. కట్ చేస్తే…ఈ సినిమా ఓ డిజాస్టర్‌గా నిలిచింది. ఎంతలా… అంటే ఇప్పటివరకు అఖిల్, ఈ చిత్రం దర్శకుడు సురేందర్‌రెడ్డి తర్వాతి సినిమాలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అంతలా అఖిల్‌ని, సురేందర్‌రెడ్డిని హార్ట్ చేసిందీ సినిమా. ఓ మంచి సినిమాతో బాలీవుడ్ డెబ్యూ ఇద్దామనుకున్న అఖిల్ ఆశలు ఆవిరి అయ్యాయి (TollywoodHero)
మైఖేల్ ఢమాల్
మరో యంగ్ హీరో సందీప్కిషన్ది సేమ్ సిట్చ్యూవేషన్. ‘మైఖేల్’పై బోలెడు ఆశలు పెట్టుకున్నారు సందీప్‌కిషన్. ఎంతో కష్టపడి సిక్స్‌ప్యాక్ చేశాడు. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశాడు. పనిలో పనిగా హిందీలోనూ హీరోగా డెబ్యూ అవుదామనుకున్నాడు. ఎలాగో ‘ఫ్యామిలీమ్యాన్’ వెబ్‌సిరీస్‌తో హిందీలో సందీప్‌కిషన్‌కు కాస్త గుర్తింపు ఉంది. అయితే సందీప్‌కిషన్‌కు ‘మైఖేల్’ ఫలితం రివర్స్ అయ్యింది. రంజిత్ జయకోడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. పుస్కూర్ రామ్మోహన్రావు, భరత్ చౌదరి నిర్మించిన చిత్రం ఇది.
ఆపరేషన్ ఫెయిల్
‘అపరేషన్ వాలెంటైన్’ సినిమా వరుణ్‌తేజ్‌కు హిందీలో తొలిసినిమా. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో తీసి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ మార్చి 1, 2024లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. శక్తి ప్రతాప్‌సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్లాప్‌గా నిలిచింది. తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది ఈ సినిమా. ఓటీటీలో మాత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుందని తెలిసింది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్స్‌తో కలిసి సిద్దు ముద్దా ఈ సినిమాను నిర్మించారు.
లైగర్..లూజర్
విజయ్‌దేవరకొండ హిందీకి వెళ్దామని చేసిన ప్రయత్నం ‘లైగర్’. పూరీ జగన్నాథ్ డైరెక్టర్. మూవీ హైప్ కోసం మైక్‌టైసన్‌ను కూడా రంగంలోకి దించారు. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్‌జోహార్ సపోర్ట్ తీసుకున్నారు. కానీ కథలో పట్టు లేదు. దీంతో లైగర్ బాక్సాఫీస్ వద్ద ఫట్టు. ఎంతలా అంటే..పూరీ జగన్నాథ్ ఈ సినిమాకోసం కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎదుర్కొవలసి వచ్చింది.
హిట్ కానీ హిందీ ఛత్రపతి
ఇక బెల్లకొండ సాయిశ్రీనివాస్ తెలుగు చిత్రాలు హిందీలో అనువదించబడ్డాయి కొన్ని. యూట్యూబ్‌లో ఈ సినిమాకు మంచి వ్యూస్ ఉన్నాయి ముఖ్యంగా ‘జయజానకినాయిక’ సినిమాకు. దీంతో బాలీవుడ్లో అదృష్టాన్ని పరిక్షీంచుకోవాలని బెల్లంకొండ ఓ ప్రయత్నం చేశారు. ప్రభాస్ హిట్ ఫిల్మ్ ‘ఛత్రపతి’ని హిందీ లో రీమేక్ చేసి, రిలీజ్ చేశారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చేసిన తొలి స్ట్రయిట్ హిందీ ఫిల్మ్ ఇదే. కట్ చేస్తే..ఈ చిత్రం బాలీవుడ్లో డిజాస్టర్. బెల్లకొండ హిందీ డెబ్యూ స్టోరీ కూడా డిజాస్టర్.
Tollywood Dussehra 2024: టార్గెట్ దసరా…సెంటిమెంట్ బోనస్!
రామ్‌చరణ్ తొలి హిందీ సినిమా ‘జంజీర్’ కూడా ఆడలేదు. ఈ చిత్రం తెలుగులో ‘తుఫాన్’గా విడుదలైంది. ఈ చిత్రంలో హీరోయిన్గా ప్రియాంకా చోప్రా, కీలక పాత్రలో సంజయ్‌దత్ నటించిన ఈ చిత్రం ఫేట్ మాత్రం మారలేదు.
హిందీలో రవితేజ సినిమాలకు మంచి పాపులారిటీ ఉంది. తెలుగులో రవితేజ తీసిన హిందీ సినిమాలు హిందీ భాషలో అనువాదమై మంచి వ్యూస్ వచ్చాయి. అందెంటో కానీ రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే పాన్ ఇండియా ఫిల్మ్ తీసి, హిందీలో రిలీజ్ చేస్తే ఆదరణ దక్కలేదు. అనుపమ్‌ఖేర్‌తో కలిసి రిలీజ్ టైమ్‌లో ప్రమోట్ చేసిన ఫలితం దక్కలేదు. ఆ నెక్ట్స్ ‘ఈగల్’ను హిందీలో సహాదేవ్గా రిలీజ్ చేసిన సేమ్ రిజల్ట్. బాక్సాఫీస్ వద్ద ప్లాప్ రిజల్ట్.
Tollywood Sequels: టాలీవుడ్‌ని సీక్వెల్ ఆవహించింది!
నాని దసరా వందకోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను కొట్టింది. హిందీలో ఆడలేదు. సాయిధరమ్‌తేజ్ ‘విరూపాక్ష’ తెలుగులో సూపర్‌హిట్. హిందీలో రిజల్ట్ తారుమారైంది. ఇలా మరికోన్ని సినిమాలు ఉన్నాయి.
ఇలా మరికొందరు హీరోలు పాన్ ఇండియా, హిందీ డెబ్యూ అంటూ అనవసరమైన రిస్క్‌లు చేస్తున్నారు. కథలో బలం ఉంటే…ఆ చిత్రం పాన్ ఇండియా హిట్ దాని అంతట అదే అవుతుంది. నిఖిల్ ‘కార్తీకేయ 2’లా, తేజాసజ్జా ‘హనుమాన్’లా. అందుకే చాలామంది హీరోలు చెప్పినట్లుగా పాన్ఇండియాను ప్లాన్ చేయకూడదు. అలా జరిగిపోవాలంటే. అలా జరగాలంటే కథ ఉండాలి. కథలో బలం ఉండాలి. ఈ కథ కొత్తదై ఉండాలి ఆడియన్స్‌కు.
Tollywood Debut heroines 2024: తెలుగులో ఈ ఏడాది పరిచయం అవుతున్న హీరోయిన్స్ సంఖ్య పెద్దదే