Tollywood Debut heroines 2024
దీపికా పదుకొనె (DeepikaPadukone)
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’(Kalki2898AD) సినిమాతో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె (Deepika padukone) హీరోయిన్గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఇదే సినిమాతో మాలీవుడ్ యంగ్ బ్యూటీ అన్నాబెన్ కూడా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం కానున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది.
జాన్వీకపూర్(Janhvikapoor)
‘దేవర’(Devara) సినిమాతో జాన్వీకపూర్ (Janhvikapoor) తెలుగు చిత్ర పరిశ్రమకు వస్తున్నారు. ఇదే సినిమాతో తెలుగు సీనియర్ నటి చైత్ర, మరాఠి బ్యూటీ శ్రుతీ మరాఠే తెలుగు వెండితెరకు వస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివకాంబినేషన్లోని ఫిల్మ్ ఇది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాను కళ్యాణ్‌రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. తొలిపార్టు ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.
ఇవానా(Ivana)
తమిళ హిట్ ఫిల్మ్ ‘లవ్‌టుడే’ తెలుగులో అనువాదపై మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో ఇవానా హీరోయిన్గా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇవానా ఇప్పుడు టాలీవుడ్‌కు వస్తోంది. నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘సెల్ఫీష్’. కాశీ వికాస్ దర్శకుడు. హీరోయిన్గా ఇవానాకు ఇదే తొలి చిత్రం. ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రీతిముకుందన్ (Preity Mukhundhan)
హీరోయిన్ ప్రీతిముకుందన్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘కన్నప్ప’. మంచు విష్ణు టైటిల్ రోల్ చేస్తున్నారు. మోడల్ ప్రీతికి కన్నప్ప తొలి చిత్రం. మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది దసరాకు విడుదల కానుంది.
భాగ్యశ్రీ భోర్సె(BhagyashriBorse)
హిందీ బ్యూటీ భాగ్యశ్రీ భోర్సెను టాలీవుడ్‌కు వెల్కమ్ చేస్తున్నారు రవితేజ. హరీష్‌శంకర్ డైరెక్షన్లో రవితేజ హీరోగా చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమా భాగ్యశ్రీ భోర్సెకు తొలి తెలుగు సినిమా. హిందీ హిట్ ‘రైడ్’కు తెలుగు రీమేక్‌గా రూపొందుతున్న సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాకు నిర్మాత.
శ్రీనిధి శెట్టి (Srinidhishetty)
‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి (Srinidhishetty) టాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న సినిమాలో శ్రీనిధి శెట్టి ఓ హీరోయిన్గా చేస్తున్నారు. రాశీఖన్నా మరో హీరోయిన్. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజకోన ఈ సినిమాతో దర్శకురాలిగా మారారు. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మాళవిక మోహనన్ (Malavika Mohanan)
హీరోయిన్ మాళవిక మోహనన్ (Malavika Mohanan)ను తెలుగు ఇండస్ట్రీకి తీసుకువస్తున్నారు ప్రభాస్. ఆయన హీరోగా మారుతి దర్శకత్వంలోని ‘రాజాసాబ్’ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. నిధీ అగర్వాల్, రిద్ధికుమార్లు ఇతర హీరోయిన్స్. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో విజయ్ దేవర కొండతో ‘హీరో’ సినిమాలో మాళవిక హీరోయిన్. కానీ ఈ సినిమా క్యాన్సిలైంది.
Tollywood Sequels: టాలీవుడ్‌ని సీక్వెల్ ఆవహించింది!
మానుషీ చిల్లర్ (MANUSHICHHILLAR)
మిస్ ఇండియా బ్యూటీ మానుషీ చిల్లర్ (MANUSHICHHILLAR)ను టాలీవుడ్‌కు తీసుకు వచ్చారు వరుణ్‌తేజ్. శక్తి ప్రతాప్‌సింగ్ దర్శ కత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా నటించిన ‘ఆపరేషన్ వాలైంటెన్’ సినిమా మానుషీకి తెలుగులో తొలి చిత్రం. మార్చి 1న విడుదల కానుంది. సందీప్ముద్దా, సోనీ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించారు.
జానీ లివర్ (jamielever)
బాలీవుడ్ ప్రముఖ నటుడు జానీ లివర్ (jamielever) తనయ జేమీ లివర్ టాలీవుడ్‌కు వస్తున్నారు. ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో జేమీ తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పనున్నారు.
సప్తమి గౌడ (Sapthami Gowda)
కాంతార సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ సప్తమి గౌడ (Sapthami Gowda). ‘తమ్ముడు’ సినిమాతో సప్తమి టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయ్యింది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీ రామ్ దర్శకుడు.
ఇంకా రవితేజ హీరోగా కేవీ అనుదీప్ డైరెక్షన్‌లోని సినిమాతో కన్నడ బ్యూటీ రుక్ష్మిణీ వసంత్, విజయ్ దేవరకొండ– గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లోని సినిమాతో బాలీవుడ్ బ్యూటీ దీప్తి తిమ్రీ, బాలకృష్ణసినిమాతో ఊర్వశీ రౌతెలా (ఫుల్ లెంగ్త్ రోల్) వంటివారు కూడా హీరోయిన్స్‌గా టాలీవుడ్‌కు వస్తున్నట్లుగా తెలుస్తోంది.
వీరితో పాటుమరికొంతమంది ఉన్నారు.