Saipallavi: హీరోయిన్ సాయిపల్లవి (Saipallavi) హిందీ ఎంట్రీ ఖరారైంది. సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తున్న తొలి హిందీ చిత్రం షూటింగ్ జపాన్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో ఆమీర్‌ఖాన్ కొడుకు జునైద్‌ఖాన్ హీరోగా నటిస్తున్నారు. సునీల్ పాండే దర్శకుడు. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు.
కాగా తమిళంలో 2022లో తమిళంలో హిట్ సాధించిన ‘లవ్‌టుడే’ సినిమా హిందీ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుందనే టాక్ బాలీవుడ్ సర్కిల్స్ వినిపిస్తోంది. ఫాంటమ్ ఫిల్మ్స్ ‘లవ్‌టుడే’ హిందీ రీమేక్ రైట్స్‌ను దక్కించుకుంది. ఇక ఈ సినిమాయే కాకుండ సాయిపల్లవి హిందీలో రణ్‌బీర్‌కపూర్ హీరోగా చేస్తున్న ‘రామాయణం’లో సీతగా చేయనున్నారనే టాక్ ఎప్పట్నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే శివకార్తీకేయన్ ‘సోల్జర్’, నాగచైతన్య ‘తండేల్’ సినిమాలతో ఇటు సౌత్‌లోనూ సాయిపల్లవి బిజీ బిజీగా ఉన్నారు. అలాగే సాయిపల్లవి సోదరి పూజ కన్నన్ వివాహం ఇటీవల జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది.