కన్నడ ప్రముఖ నటుడు దర్శన్ (Darshan) ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు. అతని అభిమాని అయిన రేణుకాస్వామిని దర్శన్ చిత్రహింసలు పెట్టి చంపారన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Kalki2898adReview: ప్రభాస్ కల్కి2898ఏడీ రివ్యూ
హీరోయిన్ పవిత్రాగౌడ్తో దర్శన్ రిలేషన్షిప్లో ఉన్నారట. పవిత్రా గౌడ్ వల్లే దర్శన్ తన భార్యకు దూరంగా ఉంటున్నారని రేణుకాస్వామి ఫీలయ్యారట. దీంతో సోషల్‌మీడియాలో పవిత్రాగౌడ్కు అభ్యంతరకరమైన సందేశాలు పంపాడు. దీంతో పవిత్రా దర్శన్‌కు కంప్లైట్ చేశారు. అభిమానిని
ఓ షేడ్‌కు పిలిపించి, అతన్ని చిత్రహింసలు పెట్టి దర్శన్ చంపారని, ఆ సమయంలో పవిత్రాగౌడ్
కూడా అక్కడే ఉన్నారన్న వార్తలు తెరపైకి వచ్చాయి. చనిపోయిన అభిమాని ఒంటిపై దాదాపు 40
గాయాలు, ఎనిమిది కాలిన గాయాలు ఉన్నాయని బెంగళూరు పోలీసులు చెప్పిటన్లుగా వార్తలు
ఉన్నాయి. మరోవైపు దర్శన్ మేనేజర్ శ్రీధర్ కూడా ఆత్యహాత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, పరిశోధన చేస్తున్నారు. ఈ విషయంపైకి రావడంతో దర్శన్‌పై సోషల్‌మీడియాలో వీపరితమైన నెగటివిటీ స్ప్రేడ్ అవుతోంది. కొందరు నెటిజన్లయితే దర్శన్‌కు జీవిత ఖైదు విధించాలన్నట్లుగా పోస్టులు పెడుతున్నారు.
ఈ వివాదం ఇలా ఉండగానే దర్శన్‌కు సపోర్ట్ చేస్తున్నట్లుగా తెలుగు హీరో నాగశౌర్య (Naga Shaurya) ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. ఈ విషయం ఒక్కసారిగా ప్రస్తుతం ఓ హాట్‌టాపిక్‌గా మారింది. దర్శన్ ఫ్యామిలీ ప్రైవసీని కూడా గౌరవించాలని, ఆయనది కూడా ఓ కుటుంబం ఉందని, చట్టంపై తనకు విశ్వాసం ఉందని నాగశౌర్య ఓ పోస్ట్ చేశారు. అయితే మర్డర్ ఆరోపణలు ఎదుర్కొంటోన్న వ్యక్తికి సపోర్ట్ చేయడం ఏంటి? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అసలే ..వరుస ఫ్లాప్స్‌తో ఇబ్బంది పడుతున్న నాగశౌర్యకు ఇలాంటి సమయంలో ఇలాంటి వివాదం అవసరమా? అనే టాపిక్ కూడా టాలీవుడ్లో వినిపిస్తోంది. ఏదీ ఏమైనా నాగశౌర్య ఓ రాంగ్ స్టెప్ అయితే వేశారు.