MegaMovies: గడిచిన రెండు మూడు సంవత్సరాల్లో మెగాకాంపౌండ్‌లో దాదాపు పది సినిమాలు క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది.
‘ఛలో’, ‘భీష్మ’ వంటి సినిమాలను తీసిన దర్శకుడు వెంకీ కుడుముల(Venkey kudumula) తో చిరంజీవి (Chiranjeevi)ఓ సినిమా చేయాల్సింది. డీవీవీ దానయ్య నిర్మాత. ఈ సినిమా క్యాన్సిల్ అయిన్నట్లుగా తెలుస్తోంది.
పవన్‌కళ్యాణ్ హీరోగా క్యాన్సిల్ అయిన సినిమాలు ఎక్కువగానే ఉన్నాయి. పవన్ చేయాల్సిన ‘సత్యగ్రహి’ చిత్రం ఆగిపోయింది. తమిళంలో అజిత్ చేసిన ‘వేదాళం’ సినిమా తెలుగు రీమేక్ పవన్‌కళ్యాణ్ హీరోగా మొదలైంది. కానీ ఈ సినిమా నిలిచిపోయింది. ఏఏమ్ రత్నం నిర్మాత. ఆ తర్వాత ఇదే సినిమాను చిరంజీవి
‘భోళాశంకర్’గా చేశారు. డిజాస్టర్‌గా నిలిచింది. అనిల్‌సుంకర నిర్మించిన ఈ చిత్రానికి మెహర్‌రమేష్ దర్శకుడు. ఇవన్నీ గతంలో కానీ…పవన్‌కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు (Hariharaveeramallu) చిత్రం ప్రారంభమైంది. ఏఎమ్ రత్నం నిర్మాత. ఈ సినిమా ప్రస్తుతం ఆల్మోస్ట్ ఆగిపోయే స్టేజ్‌లో ఉందని వార్తలు వస్తున్నాయి.
జెర్సీ సినిమా హిట్ సాధించిన తర్వాత ఈ చిత్రం దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమాకు కమిటైయ్యారు రామ్‌చరణ్ (Ramcharan). కానీ ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లోని సినిమా క్యాన్సిల్ అయ్యింది.
హీరో అల్లు అర్జున్ (AlluArjun)– దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లోని సినిమా క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. అలాగే దర్శకుడు వేణు శ్రీరామ్‌తో ‘ఐకాన్: కన బడుట లేదు’ అనే సినిమాను ప్రకటించారు అల్లు అర్జున్. కానీ ఇప్పుడు ఈ సినిమా ఊసే లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్‌కు ఉన్న ప్యాన్ ఇండియా రేంజ్‌కి వేణు శ్రీరామ్ తో సినిమా అంటే కుదరకపోవచ్చు. ఇలా ఈ సినిమా క్యాన్సిల్ అయినట్లే.
Very much elated to announce my next film #AA21 with Koratala Shiva garu . Been looking forward for this for quiet a while . My best wishes to Sudakar Garu for his 1st venture . Sandy , Swathi & Nutty this is my way of showing of my love for you guys . pic.twitter.com/uwOjtSAMJV
— Allu Arjun (@alluarjun) July 31, 2020
రామ్‌చరణ్‌తో ‘రచ్చ’ సినిమా తీశారు దర్శకుడు సంపత్‌నంది. చిరంజీవి హీరోగా ‘గాడ్‌ఫాదర్’ సినిమా వచ్చింది. నిజానికి ‘గాడ్‌ఫాదర్’ టైటిల్ హక్కులు సంపత్ నందివేనట. కానీ చిరంజీవి కోసం ఆ టైటిల్‌ను వదులుకున్నారు సంపత్‌నంది. అయితే ఈ దర్శకుడు సాయిథరమ్‌తేజ్‌తో ‘గంజాశంకర్’అనే కమర్షియల్
సినిమా చేయాల్సింది. కానీ బడ్జెట్ కారణాల వల్ల ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. క్యాన్సిల్ అయ్యింది.
వరుణ్‌తేజ్(Varunteja) హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో ఓ సినిమా రావాల్సింది. కానీ ఈ సినిమా క్యాన్సిల్ కాబడింది.