Ramcharan: ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్‌చరణ్ ఎక్కువగా సమయం కేటాయిస్తున్న సినిమా ‘గేమ్‌చేంజర్’(Gamechanger). తమిళ ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటం ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. రీసెంట్గా ‘గేమ్‌చేంజర్’ సినిమాను ఈ ఏడాది సెప్టంబరులో విడుదల చేయనున్నట్లుగాఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన ‘దిల్’ రాజు పేర్కొన్నారు. కానీ సెప్టెంబరు 27న పవన్‌కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ తరుణంలో ‘గేమ్‌చేంజర్’సెప్టెంబరులో విడుదల కాని పరిస్థితి. ఇలా గేమ్‌చేంజర్ సినిమా రిలీజ్‌కు ఓజీ రూపంలో రామ్‌చరణ్‌కు మరో అడ్డంకి వచ్చింది. అయితే ‘గేమ్‌చేంజర్’ సినిమాను అక్టోబరులోవిడుదల చేయాలని ‘దిల్’ రాజు ప్లాన్ చేస్తున్నారట. ఇక కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, ఎస్జే సూర్య, అంజలి, జయరాం, శ్రీకాంత్, నవీన్‌చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘గేమ్‌చేంజర్’ ఉండబోతుంది. ఇందులో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తండ్రీకొడుకుల పాత్రల్లోకనిపిస్తారు. ‘గేమ్‌చేంజర్’ కాకుండ రామ్‌చరణ్ కమిటైన మరో సినిమాకు ‘బుచ్చిబాబు’ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Ramcharan: రామ్‌చరణ్‌కు మరో అడ్డంకి?
'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్‌చరణ్ ఎక్కువగా సమయం కేటాయిస్తున్న సినిమా 'గేమ్‌చేంజర్'. తమిళ ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ సినిమాను తెరకెక్కి స్తున్నాడు. అయితే ఈ సినిమా విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటం ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.
Leave a comment
Leave a comment