Ramcharan: రామ్‌చరణ్ కెరీర్లో ‘రంగస్థలం’ సూపర్‌డూపర్ హిట్ ఫిల్మ్. ఈ సినిమాలో రామ్‌చరణ్ యాక్టింగ్ సూపర్ గా ఉంటుంది. చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్ చేసిన యాక్టింగ్, చరణ్‌ను మరో మెట్టు నటుడిగా ఎక్కిం చింది. అయితే సుకుమార్, రామ్‌చరణ్ కాంబినేషన్లో మరోసారి రిపీట్ కానున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ చేస్తున్నారు సుకుమార్. pushpa సినిమా విడుదల కాగానే, సుకుమార్ నెక్ట్స్ ఫిల్మ్ రామ్‌చరణ్‌తోనే అన్నది ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న లేటెస్ట్ గ్యాసిప్. అయితే ఇందుకు చాలా సమయం ఉంది.
రామ్‌చరణ్ ప్రస్తుతం ‘గేమ్‌చేంజర్’తో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మి స్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో ఈ సినిమా విడుదల అవుతుంది. ఈ సినిమా తరవాత బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తారు రామ్‌చరణ్. ఈ సినిమాకు సుకుమార్ కూడా ఓ నిర్మాత. మైత్రీమూవీమేకర్స్, వెంకట సతీష్ కిలారులు ఇతర నిర్మాతలు. ఈ రెండు సినిమాలను పూర్తి చేసిన తర్వాత సుకుమార్‌తో రామ్‌చరణ్ సినిమా ఉంటుంది. ఈ సినిమా అధికారిక ప్రకటన రావడానికి కాస్త సమయం పడుతుంది. మరోవైపు విజయ్‌దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటన వచ్చినా, ఇప్పుడు ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు.