RamcharanGameChanger: రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ ‘గేమ్‌చేంజర్’. దర్శకుడు శంకర్..ఇటు ‘గేమ్‌చేంజర్’, అటు..కమల్‌హాసన్ ‘ఇండియన్ 2’ సినిమాలను సమాంతరంగా తెరకెక్కిస్తున్నారు. ఇలాకాకుండ ‘గేమ్‌చేంజర్’ సినిమానే శంకర్ తీసినట్లయితే ‘గేమ్‌చేంజర్’ ఈ పాటికేవిడుదల అయ్యేది కానీ కుదర్లేదు. అయితే ‘గేమ్‌చేంజర్’ సినిమాను ఈ ఏడాది సెప్టెంబరులో విడుదలచేస్తున్నట్లుగా ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన ‘దిల్’ రాజు వెల్లడించారు. శిరీష్ మరో నిర్మాత. ఇక రామ్‌చరణ్ డ్యూయోల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తుండగా, అంజలి, ఎస్జే సూర్య, మలయాళ నటుడు జయరాం, నవీన్‌చంద్ర, సునీల్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ స్వరకర్త. మరోవైపు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనాతో రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమా రానుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది.
Ramcharan Gamechanger: సెప్టెంబరులో గేమ్‌చేంజర్
Leave a comment
Leave a comment