Prabhas SalaarCeasefire Khansar Story: మూడు తెగల (మన్నార్, శౌర్యాంఖ, ఘనియార్) బందీపోట్లు కలిసి వందల ఏళ్ల తరబడి ప్రజల సంపదను దోచుకుని ‘ఖాన్సార్’ సిటీని నిర్మించుకున్నారు. కొండలకు, సముద్రాని మధ్య ఉన్న అడివిని ఖాన్సార్సిటీగా అభివృద్ధి చేశారు ఈ మూడు తెగల నాయకులు. బ్రిటిష్ సమ్రాజ్యం కూడా ‘ఖాన్సార్’ను ఏబమాత్రం ప్రభావితం చేయలేకపోయిందని దర్శకుడు ప్రశాంత్‌నీల్ ‘సలార్:సీజ్ఫైర్’ సినిమాలో చూపించాడు. అలా భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1947లో ‘ఖాన్సార్’ను, భారతదేశంలోని ప్రాంతంగా గుర్తించవద్దని, అప్పటిక ‘ఖాన్సార్ కర్త’ (ఖాన్సార్ రాజు) శివమన్నార్ అప్పటి రాజకీయబనాయలకు చెప్తాడు (దర్శకుడు ప్రశాంత్‌నీల్ కథ ప్రకారం). అసలే..బందిపోట్లుపైగా, మితీమిరిన హింసనుఅలవాటుగా ఉన్న ఈ తెగల జోలికి ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోకూడదనే అనుకుంటుందట(కథ ప్రకారం). అలాగే ‘ఖాన్సార్’లోని తెగల మధ్య గొడవలు రాకుండా ఉండేందుకు ‘ఖాన్సార్’లో ‘నిబంధన’ అనే ఓ గ్రంధం రాసుకున్నారు (భారతదేశానికి రాజ్యాంగం ఉన్నట్టు).
Prabhas and PrashanthNeel Salaar CeaseFire: ప్రభాస్ సలార్:సీజ్ఫైర్ రివ్యూ
కాలక్రమేణ శివమన్నార్ కాలం చేస్తారు(మరణిస్తాడు). ‘ఖాన్సార్’ ఒప్పందాల ప్రకారం మన్నార్ తెగ నాయకుడి పాలన తర్వాత శౌర్యాంఖ తెగ నాయకుడు ఖాన్సార్ కర్త(రాజు) కావాలి. కానీ అధికారాన్ని ఏ మాత్రం చేజార్చుకోవడానికి ఇష్టం లేని రాజమన్నార్(శివ మన్నార్ కొడుకు –జగపతిబాబు పాత్ర), అర్థరాత్రి వేళ ‘శౌర్యాంఖ తెగ’ మొత్తాన్ని హతమార్చడానికి ప్రణాళిక వేసి, వారందని అంతం చేస్తాడు. ఈ ఉచకోతలో భాగంగా శౌర్యాంఖ తెగవారు ఆల్మోస్ట్ అందరు చనిపోతారు. కానీ రాజమన్నార్ జరిపిన ఈ మారణకాండలో శౌర్యాంఖ తెగలోని కొందరు పిల్లలు రహస్యంగా దాచబడి, ప్రాణాలు కాపాడబడతాయి. అందరు శౌర్యాంఖ తెగ అంతమైందనే అను కుంటారు. కానీ శార్యాంఖ తెగ చిన్నారులు ఖాన్సార్‌లో అజ్ఞాతవాసులుగా జీవనం సాగించి, పెరిగి పెద్దవారు అవుతారు. వీరిలో భారవ కాస్త ముందుండి, రాజమన్నార్ మొదటి భార్య కుమార్తె రాధారామ(శ్రియా రెడ్డి)కి భర్త అవుతాడు. అంటే రాజమన్నార్‌కు అల్లుడు. శౌర్యాంఖా తెగలోని వారు ఇంకా బతికే ఉన్నారని, వారు ‘ఖాన్సార్’ను సొంతం చేసుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని, వారిలో ఒకరు తన అల్లుడు భారవేనని రాజమన్నార్ తెలుసుకుంటాడు. ఇటు..ఘనియార్ తెగవారు కూడా ‘ఖాన్సార్’పై పట్టు సాధించాలని, బలంతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని నిర్ణయించుకుంటారు. నిజం తెలుసుకున్న రాజమన్నార్ ఏం చేస్తాడు? స్నేహం కోసం ‘ఖన్సార్’కు వరదరాజమన్నార్(రాజమన్నార్ రెండో భార్య పెద్ద కుమారుడు) ను రాజును చేస్తానని మాట ఇచ్చిన దేవరథా ఆ మాటను ఎలా నిలబెట్టుకుంటాడు? తన నాన్నకు దక్కాల్సిన ‘ఖాన్సార్’ కర్త గౌరవాన్ని బలవంతంగా రాజమన్నార్ లాక్కున్నారని, ‘ఖాన్సార్’ ఒప్పందాల ప్రకారం ‘ఖాన్సార్’కు కర్త అయ్యే నిజమైన హక్కు తనకే ఉందని దేవరథ ‘సలార్’కు నిజం తెలుస్తుందా? తెలిస్తే…ఏం చేస్తాడు? అనేది ‘సలార్:శౌర్యాంఖా పర్వం’లో చూడాలి.
Prabhas SalaarCeasefire: ప్రభాస్ ‘సలార్:సీజ్ఫైర్’ కలెక్షన్స్లపై కన్ఫ్యూజన్