Prabhas – Sruthihaasan: శ్రుతీహాసన్ కోసం ప్రభాస్ ఫైట్ చేశాడు…ఇది సలార్’ ‘సినిమాలోని రీల్ సీన్. కానీ శ్రుతీహాసన్ కోసం ప్రభాస్ నిజంగానే వాదనపెట్టుకున్నాడు…గొడవ పడ్డారు ఇది రియల్ సీన్. ఈ విషయాన్ని శ్రుతీహాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మీరు ప్రభాస్‌తో యాక్టర్ చేశారు. ప్రభాస్‌తో మీ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకోమని అడగ్గా శ్రుతీహాసన్కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
”ప్రభాస్ సూపర్ కో స్టార్. సెట్స్‌లో అందర్ని కూల్‌గా ఉంచుతారు. 2022 అంటే ‘సలార్’ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు నాకు ఆరోగ్యం బాగోలేదు. దీంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాను. ఆ హాస్పిటల్ రూల్ ప్రకారం బయటి ఆహారం తినకూడదు. తీసుకోకూడదు. కానీ ప్రభాస్ మాత్రం తన ఇంటి నుంచి మంచి రుచికరమైన ఆహారాన్ని నాకు తెచ్చి ఇచ్చారు. హాస్సిటల్ సిబ్బంది కొందరు అభ్యంతరం చెప్పారు. కానీ ప్రభాస్ వినలేదు. వారితో వారించి,
వాదించి నేను హోమ్ ఫుడ్ తినేలా చేశాడు. నేను వెంటనే కోలుకున్నాను. నా కనే కాదు…ప్రభాస్ ఎవరికోసమైనా ఇలానే చేస్తారు. నాకు ఫలానా ఇష్టం అని సెట్స్‌లో ఎవరైనా చెబితేచాలు అది వెంటనే తెచ్చి ఇస్తారు. ఇలా సెట్స్‌లో చాలామందికి చేశారు. చాలామందికి హోమ్ ఫుడ్ తెచ్చేవారు” అని చెప్పుకొచ్చారు శ్రుతీహాసన్. ఇక ప్రభాస్, శ్రుతీహాసన్ నటించిన’సలార్’ సినిమాలోని తొలిపార్టు ‘సలార్ సీజ్ఫైర్’ చిత్రం హిట్‌గా నిలిచింది. ఈ సినిమా మలిభాగం సలార్ శౌర్యాంగపర్వం షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ ఏడాదే షూటింగ్‌ను ప్రారంభించి, వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు మేకర్స్.
Adivi Sesh with Shruthi Haasan శేష్‌తో శ్రుతి
TollywoodHeroines: అనుష్కాశెట్టి…కీర్తీసురేష్..అన్యాయంపై పోరాటం!