హాస్య నటుడిగా ‘వెన్నెల’ కిశోర్ సిల్వర్‌స్క్రీన్‌పై బ్లాక్‌బస్టర్ హీరో. తన యాక్టింగ్‌తో ఎన్నో సినిమాల విజయాల్లో విజ యాల్లో ముఖ్య భూమిక పోపించారు. అలాంటి ‘వెన్నెల’ కిశోర్ తొలిసారి హీరోగా నటించిన చిత్రం ‘చారి 111’. ఈ కామెడీ స్పై యాక్షన్ ఫిల్మ్‌కు టీజీ కీర్తీకుమార్ డైరెక్టర్. సుమంత్‌తో ‘మళ్లీ మొదలైంది’ సినిమా తీసింది ఈ దర్శకుడే. మరి…’వెన్నెల’ కిశోర్ హీరోగా సక్సెస్ అయ్యాడా? లేదా రివ్యూలో చదవండి .
నటీనటులు ‘వెన్నెల’ కిశోర్, సంయుక్తా విశ్వనాథన్, మురళీ వర్మ, సత్య
దర్శకుడు: టీజీ కీర్తీ కుమార్
నిర్మాత : అదితి సోనీ
సంగీత దర్శకుడు: సైమన్ కె కింగ్
సినిమాటోగ్రాఫర్ :రిచర్డ్ కెవిన్ ఏ
ఎడిటింగ్ : కాశీష్ గ్రోవర్
రన్ టైమ్ : 129 నిమిషాలు
కథ
రుద్రనేత్ర సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీలో ఓ సస్పెండెడ్ ఏజెంట్ చారి 111(వెన్నెల కిశోర్). ఈ ఏజెన్సీ హెడ్ ప్రసాదరావు( మురళీ శర్మ). హైదరాబాద్‌లో ఓ సూసైడ్ బాంబర్ ఏటాక్ జరుగు తుంది. ఈ ఏటాక్ సూత్రధారులు ఎవరో తెలుసు కోవడానికి చారిని రీ అపాయింట్ చేస్తాడు ప్రసాదరావు. కాస్త కన్ఫ్యూజ్డ్గా ఉండే చారికి అసిస్టెంట్ బంటి(తాగుబోతు రమేష్), సహ ఉద్యోగులు రాహుల్(సత్య), ఇషా (సంయుక్తా విశ్వనాథ్). సూసైడ్ బాంబర్ ఏటాక్ అసలు సూత్రధారులు ఎవరు? కన్ఫ్యూజ్డ్గా ఉండే చారి ఈ కేసును ఎలా సాల్వ్ చేయగలిగాడు? ఈ క్రమంలో రాహుల్, ఇషాలు చారికి ఏ విధంగా సహపడ్డారు? ప్రసాదరావు గైడెన్స్ చారికి ఏ విధంగా ఉపయోగపడ్డాయి? అన్నది మిలిగిన కథ
విశ్లేషణ
ప్రభుత్వ సీక్రెట్ ఏజెన్సీస్‌లో వర్క్ చేసే కొందరు ప్రతిభావంతులు స్వార్థం కోసమే, స్వలాభం కోసమో తప్పుడు దారి తొక్కి దేశద్రోహులు అవుతారు. ఈ దేశ ద్రోహులను సీక్రెట్ ఏజెన్సీలోని వారే చంపుతారు. భారతీయ సినిమా సనాతన స్పై స్టోరీ ఫిల్మ్‌ల బేసిక్ రోటీన్ స్టోరీ లైన్ ఇది. ‘చారి 111’ బేసిక్ స్టోరీ లైన్ కూడా ఇదే. కాకపోతే కథలో కాస్త కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఎక్కువైంది. హీరో వెన్నెల కిశోర్ కాబట్టి కాస్త హాస్యం ఎక్కువగా జోడించాడు. కానీ ఈ హాస్యం ఇలాంటి స్టోరీలైన్స్కు నప్పదు. చారి 111 విషయంలోనూ ఇదే జరిగింది. 2005లో ‘రుద్రనేత్ర’ను ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందో అన్న సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. ‘రుద్రనేత్ర’ ఆఫీస్‌లోని క్యారెక్టర్ల ఇంట్రడక్షన్, సూసైడ్ బాంబ్ ఏటాక్, చారి రంగంలోకి దిగడం, చేతకాని చారికి ఇషా ప్లాన్ బిగా ఉండటం ఇలాంటి సీన్స్‌తో సినిమా ప్రీ ఇంట్రవెల్ వరకూ వచ్చేస్తుంది. దేశద్రోహి మహి, ఆమె కొడుకు రావన్ల కథతో సెకండాఫ్ కథ మురళీ శర్మ వాయిస్ ఓవర్‌తో సాగుతూ ఉంటుంది. రుద్రనేత్ర స్థావరానికి రావన్ వచ్చి ప్రసాదరావు, రాహుల్‌లను అతని స్థావరానికి తీసుకుని వెళ్లడంతో, రావన్ దగ్గరకు చారి వెళ్లి మిషన్‌ను కంప్లీట్ చేయడంతో సినిమా సమాప్తం అవుతుంది.
Prabhas – Shrutihaasan: ప్రభాస్ నాకోసం వాళ్లతో గొడవ పడ్డాడు: శ్రుతీహాసన్
అయితే ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ బాగుంటుందని అనిపించినా…ఇది రోటీన్ సీన్. కథను ఆడియన్స్ ఊహిస్తారు. కెమికల్ క్యాప్సిల్ ఓ బాంబ్‌గా మారడం అనే విధానం కూడా కన్విన్సింగ్‌గా ఉండదు. చిన్న మొతాదులో ఉండే క్యాప్సిల్ అంత పెద్ద బాంబ్‌గా ఎలా బ్లాస్ట్ అవుతుందో దర్శకుడు చెప్పిన వివరణ సహేతుకంగా అనిపించకపోవచ్చు. ఒక పక్క బాంబ్‌బ్లాస్ట్‌లు జరుగుతుంటే ఈ కేసును రుద్రనేత్ర ఏజెన్సీనే సాల్వ్ చేయాలని ముఖ్యమంత్రి పట్టుబడటం కామెడీగా ఉంటుంది. ‘రా’, ‘సీబీఐ’ల కంటే ముందే ఈ కేసును రుద్రనేత్ర సాల్వ్చేయాలంట. ప్రాణనష్టం కంటే…రుద్రనేత్ర ఎజెన్సీ పరువే ముఖ్యం అన్నట్లు డైరెక్టర్ రాసుకున్న కథను ఏమని చెప్పాలి. ముఖ్యమంత్రితో చారి ‘లీవ్’ కామెడీ, చారి-రాహుల్‌ల అతికామెడీచాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. ఇంకా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి. స్పైగా కాకుండ వెన్నెల కిశోర్‌ను ఓ హాస్యనటుడిగా అనుకుంటే కొన్ని సీన్స్ నవ్విస్తాయి.
అయితే ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ బాగుంటుందని అనిపించినా…ఇది రోటీన్ సీన్. కథను ఆడియన్స్ ఊహిస్తారు. కెమికల్ క్యాప్సిల్ ఓ బాంబ్‌గా మారడం అనే విధానం కూడా కన్విన్సింగ్‌గా ఉండదు. చిన్న మొతాదులో ఉండే క్యాప్సిల్ అంత పెద్ద బాంబ్‌గా ఎలా బ్లాస్ట్ అవుతుందో దర్శకుడు చెప్పిన వివరణ సహేతుకంగా అనిపించకపోవచ్చు. ఒక పక్క బాంబ్‌బ్లాస్ట్‌లు జరుగుతుంటే ఈ కేసును రుద్రనేత్ర ఏజెన్సీనే సాల్వ్ చేయాలని ముఖ్యమంత్రి పట్టుబడటం కామెడీగా ఉంటుంది. ‘రా’, ‘సీబీఐ’ల కంటే ముందే ఈ కేసును రుద్రనేత్ర సాల్వ్చేయాలంట. ప్రాణనష్టం కంటే…రుద్రనేత్ర ఎజెన్సీ పరువే ముఖ్యం అన్నట్లు డైరెక్టర్ రాసుకున్న కథను ఏమని చెప్పాలి. ముఖ్యమంత్రితో చారి ‘లీవ్’ కామెడీ, చారి-రాహుల్‌ల అతికామెడీచాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. ఇంకా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి. స్పైగా కాకుండ వెన్నెల కిశోర్‌ను ఓ హాస్యనటుడిగా అనుకుంటే కొన్ని సీన్స్ నవ్విస్తాయి. సినిమా నిడివి తక్కువే. ఇంకా తక్కువ చేయవచ్చు. సైమన్ కింగ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. నిర్మాణ విలవలు ‘రుద్రనేత్ర’ బడ్జెట్‌కు తగ్గట్లే ఉన్నాయి.
ఫెర్మార్మెన్స్
చారి పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ ఏదో చేయాలనే తపన పడ్డారు. కానీ చేసిందీ ఏమీ లేదు. ప్రసాదరావుగా మురళీశర్మ రోల్ బలంగా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి సినిమా ఎండింగ్ వరకూ ఉంటుంది. ఓ రకంగా కథను ముందుకు నడిపింది ఈ పాత్రే. ఈషాగా సంయుక్త, బంటిగా తాగుబోతు రమేష్, వ్యాపరవేత్త శ్రీనివాస్‌గా బ్రహ్మజీ, ముఖ్యమంత్రిగా రాహుల్‌రవీంద్రన్, 2005 ముఖ్యమంత్రిగా శుభలేకసుధాకర్ పాత్రల మేరకు చేశారు. సంయుక్తాకు మాత్రం తొలిభాగంలో ఓ చిన్నపాటి గ్లామర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంది. సత్య కామెడీ బాగోదు. సినిమా నిడివి తక్కువే. ఇంకా తక్కువ చేయవచ్చు. సైమన్ కింగ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. నిర్మాణ విలవలు ‘రుద్రనేత్ర’ బడ్జెట్‌కు తగ్గట్లే ఉన్నాయి.
TollywoodHeroines: అనుష్కాశెట్టి…కీర్తీసురేష్..అన్యాయంపై పోరాటం!
SSRajamouli: చెట్టు ఆధారంగా సినిమా..పాకిస్తాన్లో దొరకని అనుమతులు
బలాలు
వెన్నెల కిశోర్ కొన్ని కామెడీ సీన్స్
మురళీశర్మ
ఆర్ఆర్
బలహీనతలు
కథ, కథనం
బలవంతపు కామెడీ
సాగదీత సన్నివేశాలు