TollywoodHeroines: గతంలో విజయశాంతి వంటి నటి ‘కర్తవ్యం’, ‘ఓసేయ్…రాములమ్మ’ వంటి సినిమాలు చేశారు. ఆ తర్వాత ఈ తరహాలో మరికొన్ని సినిమాలు వచ్చిన అవి అంత ఇంపాక్ట్‌ను క్రియేట్ చేయలేకపోయాయి. అయితే ఈకోవలో హీరోయిన్ అనుష్కాశెట్టి, కీర్తీ సురేష్‌లు తాజాగా సినిమాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. (TollywoodHeroines) ఉమెన్ సెం ట్రిక్ ఫిల్మ్స్‌లో సక్సెస్‌రేటు ఎక్కువగా ఉన్న అనుష్కాశెట్టి లేటెస్ట్ ఫిల్మ్ ‘శీలవతి’( ప్రచారంలో ఉన్న టైటిల్). అనుష్కాశెట్టితో ‘వేదం’ వంటి సినిమా తీసిన జాగర్లమూడి రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత అనుష్కాశెట్టి, దర్శకుడు క్రిష్ కలిసి సినిమా చేస్తున్నారు. యువీ క్రియేషన్స్ నిర్మిస్తోందీ సినిమాను. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ఆంధ్రా–ఒడిస్సా బోర్డర్లో జరిగింది. వాస్తవ సంఘటల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట దర్శకుడు క్రిష్. ఈ సినిమాలో అన్యాయాన్ని ఎదిరించి, న్యా యం కోసం పోరాడే ఓ మహిళ పాత్రలో అనుష్కాశెట్టి కనిపిస్తారనే టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
Anushka Shetty: హాఫ్ సెంచరీలు కొట్టిన అనుష్కా..అంజలి!
మరోవైపు మహానటి వంటి సినిమాతో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ జానర్‌తో తన సత్తాను చాటుకున్నారు కీర్తీసురేష్. కానీ ఆమె ఈ కోవలో చేసిన ‘పెంగ్విన్’, ‘గుడ్ లక్ సఖి’, ‘మిస్ ఇండియా’ వంటి సినిమాలు చేశారు. కానీ ఏదీ హిట్ కాలేదు. కానీ పట్టువదలకుండ ఈ జానర్లో సినిమాలు చేస్తూనే ఉన్నారు కీర్తీసురేష్. ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ ‘రఘు త«థా’, ‘రివాల్వర్ రీటా’, ‘కన్నెవేది’ అనే మూడు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేస్తున్నారు. వీటిలో ‘రఘు త«థా’ సినిమాను ‘కేజీఎఫ్’, ‘సలార్’, ‘కాంతార’ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ తమిళ సినిమాకు సుమన్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో తమిళులు హిందీ భాషను నేర్చుకోవాలనే ఓ నిబంధనకు వ్యతిరేకంగా ప్రభు త్వంపై పోరాడే యువతిగా కీర్తీ సురేష్ కనిపిస్తారే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఇలా కీర్తీ సురేష్, అనుష్కాశెట్టిలు వారి వారి సినిమాల దృష్ట్యా పోరాటాలు చేస్తున్నారు అన్యాయంపై. వీరి పోరాటాలకు ఆడియన్స్ మద్దతు ఇచ్చి న్యాయం చేకూర్చాలని కోరుకుందాం మరి.