Anushka Shetty: ఉమెన్‌సెంట్రిక్ సినిమాలకు టాలీవుడ్లో అనుష్కాశెట్టి (Anushka Shetty) పెట్టింది పేరు. ‘అరంధతి’, ‘భాగమతి’, ‘పంచాక్షరి’, ‘సైజ్‌జీరో’..ఇలాంటి సినిమాలు చేశారు అనుష్కాశెట్టి. తాజాగా మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌కు అనుష్కాశెట్టి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నారు అనుష్కాశెట్టి. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోందని తెలిసింది. అయితే గతంలో యూవీ క్రియేషన్స్‌లో అనుష్కాశెట్టి ‘భాగమతి’ (Bhaagamathie) సినిమా చేశారు. గత ఏడాదిలో ‘భాగమతి’ సినిమాకు సీక్వెల్‌ను ప్రకటించారు యూవీక్రియేషన్స్ వారు. దీంతో ప్రస్తుతం క్రిష్ డైరెక్టర్ చేస్తోంది ‘భాగమతి 2’ నా అనే గ్యాపిస్స్ వినిపిస్తున్నాయి. ఇక వేదం తర్వాత అనుష్కాశెట్టి, దర్శకుడు క్రిష్ కాంబోలో మళ్లీ పధ్నాలుగు సంవత్సరాల తర్వాత రాబోతున్న సినిమా ఇదే కావడం విశేషం.
Anushka Shetty: 14 సంత్సరాల తర్వాత
యూవీ క్రియేషన్స్‌లో అనుష్కాశెట్టి 'భాగమతి' సినిమా చేశారు. గత ఏడాదిలో 'భాగమతి' సినిమాకు సీక్వెల్‌ను ప్రకటించారు యూవీక్రియేషన్స్ వారు. దీంతో ప్రస్తుతం క్రిష్ డైరెక్టర్ చేస్తోంది 'భాగమతి 2' నా అనే గ్యాపిస్స్ వినిపిస్తున్నాయి.
Leave a comment
Leave a comment