KeerthySuresh: బాలీవుడ్ మూవీ ‘బేబీ జాన్’(Babyjhon)తో బాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయం అవుతున్నారు హీరోయిన్ కీర్తీ సురేష్(Keerthysuresh). కానీ బాలీవుడ్లో కీర్తీ సైన్ చేసిన తొలి సినిమా ఇది కాదు. ఆ సినిమా పేరు మైదాన్. అజయ్‌దేవగన్ హీరో. అమిత్‌శర్మ దర్శకుడు. బోనీకపూర్, జీ స్టూడియోస్ ఆ సినిమాను స్టార్ట్ చేశారు 2020లో. స్పోర్ట్స్ డ్రామా మైదాన్‌లో సయ్యద్ అబ్దుల్ రహామాన్ పాత్రలో అజయ్‌దేవగన్ కనిపిస్తారు. సయ్యద్ భార్య పాత్రకు కీర్తీ సురేష్‌ను తీసుకున్నారు ‘మైదాన్’ టీమ్. కానీ ఈ సినిమాలో అజయ్ భార్య పాత్రకు కాస్తఏజ్డ్ హీరోయిన్ అయితే బాగుంటుందని భావించి, కీర్తీసురేష్‌ను తప్పించారట మేకర్స్ అప్పట్లో. దీంతో ఆ సమయంలో ఈ చాన్స్ ప్రియమణికి దక్కింది. అలా బాలీవుడ్లో కీర్తీసురేష్‌కు తొలి చాన్స్ మిస్ అయ్యింది.
ఇప్పుడు వరుణ్థావన్(Varundhawam) ‘బేబీ జాన్’తో బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు కీర్తీ. ఈ చిత్రంలో వామికా గబ్బా మరో హీరోయిన్. కాలీస్ దర్శకుడు. దర్శకుడు అట్లీ సమర్పణలో ప్రియా అట్లీ, మురాద్ ఖేతనీ, జ్యోతిదేశ్ పాండే నిర్మిస్తున్నారు ఈ సినిమాను. మే 31న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇలా నాలుగు సంవత్సరాల నిరీక్షణ తర్వాత కీర్తీ బాలీవుడ్లో పరిచయం అవుతున్నారు. తమిళ హిట్ ఫిల్మ్ ‘తేరి’కి హిందీ రీమేక్‌గా ‘బాబీ జాన్’ రూపొందుతున్నట్లుగా తెలిసింది. ఈ సినిమాకు అట్లీనే తమిళంలో దర్శకుడు. ఇక ఇక్కడ కొసమెరపు ఏంటంటే…కీర్తీ సురేష్ కోల్పోయిన ‘మైదాన్’ సినిమా ఇంకా విడుదల కాలేదు. బాలీవుడ్లోనే ఎక్కువసార్లు వాయిదా పడిన చిత్రంగా కూడా ‘మైదాన్’ను చెప్పుకుంటున్నారట. ఎందుకంటే అధికారికంగానే ఈ చిత్రం ఆరుసార్లు వాయిదా పడిందని బాలీవుడ్ సమాచారం. ఇటీవల ఈ ఏడాది రంజాన్
సందర్భంగా ‘మైదాన్’ సినిమాను విడుదల చేస్తామని, చిత్రంయూనిట్ ప్రకటించింది. మరి..ఈ సారైనా ‘మైదాన్’ సినిమా థియేటర్స్‌లోకి వస్తుందో లేదో చూడాలి.