అడవి శేష్, శ్రుతీహాసన్ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ ఫిల్మ్ తెరకెక్కనుంది. సినిమాటోగ్రాఫర్ షానీల్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో అడివి శేష్ హీరోగా నటించిన ‘క్షణం’, ‘గూఢ చారి’ వంటి సినిమాలకు షానీల్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. అంతేకాదు..షానీల్ దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్ ‘లైలా’ కాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపికైంది. ఈ సినిమాకు షానీల్తో కలిసి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు అడివి శేష్. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించనున్న ఈ సినిమాను అన్నపూర్ణస్టూడియోస్ పతాకంపై సుప్రియా యార్లగడ్డ నిర్మించనున్నారు. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. మరోవైపు ‘గూఢచారి 2’ సినిమా కూడా చేస్తున్నారు అడివి శేష్. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది.
Adivi Sesh with Shruthi Haasan శేష్‌తో శ్రుతి
Leave a comment
Leave a comment