Shruti Haasan: ‘అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ అనే నవల ఆధారంగా హాలీవుడ్ దర్శకుడు జాన్ ఫిలిప్‌తో ఓ సిని మా చేసేందుకు సమంత గతంలో ఒప్పుకున్నారు. గతంలో సమంత నటించిన ‘ఓ బేబీ’ సిని మాకు ఓ నిర్మాత అయిన సునీతాతాటి ఈ చిత్రానికి ఓ నిర్మాత. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి సమంత తప్పుకున్నారు. తన ఆరోగ్య కారణాల వల్లే సమంత తప్పుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాకు సైన్ చేశారు శ్రుతీహాసన్. ఈ సినిమాలో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని రన్ చేసే పాత్రలో శ్రుతీహాసన్ నటిస్తారు. శ్రుతీ కో యాక్టర్‌గా వివేక్ కల్రా నటిస్తారు. ఈ సినిమాకు చెన్నైస్టోరీస్ అనే టైటిల్‌ను కూడా అను కుంటున్నారు. ఈ సినిమాలో లెస్బి యన్ క్యారెక్టర్లో నటిస్తారట శ్రుతీహాసన్. తన తండ్రి ఆచూకి తెలుసుకోవాలని ఓ వ్యక్తి ఓ డిటెక్టివ్ ఏజెన్సీని కన్సల్ట్ అయితే ఏం జరుగుతుంది? అనే కోణంలో ఈ సినిమా ఉంటుంది. ఆల్రెడీ శ్రుతీహాసన్ ‘ది ఐ’ అనే ఓ ఇంటర్నేషనల్ మూవీని ఇటీవల కంప్లీట్ చేశారు.
ఈ సంగతి ఇలా ఉంచితే…కోలీవుడ్ నిర్మాణసంస్థ డ్రీమ్‌వారియర్ పిక్చర్స్‌తో సమంత ‘రెయిన్ బో’ అనే సినిమాకు కమిటైయ్యారు. శాంతరూబన్ దర్శకుడు. అయితే ఈ సినిమాలో సమంత నటించకపోవడంతో ఆ సినిమాను ఇప్పుడు రష్మికా మందన్నా చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ మొదలైంది. ఈ ఏడాదే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.