హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్‌నీల్ కాంబినేషన్లోని ‘సలార్’ సినిమా తొలిభాగం ‘సలార్:సీజ్ఫైర్’ డిసెంబరు 22న విడుదలైంది. కాగా ఈ సినిమా విడుదలైన తొలిరోజే రూ. 179 కోట్ల రూపాయల గ్రాస్కలెక్షన్స్ను సాధించినట్లుగా మేకర్స్ డిసెంబరు 23న ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ 180 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా, ఓ హిందీ పేపర్లో అంటే..డిసెంబరు 22 సాయంత్రానికే ఓ యాడ్ ఇచ్చారు మేకర్స్. అసలు..మొదటిరోజు పూర్తి కాకుండానే…తొలిరోజుకలెక్షన్స్ ఎలా ప్రకటించారు? అనే ప్రశ్నలు సోషల్‌మీడియాలో వస్తున్నాయి. మరోవైపు సలార్ కలెక్ట్ చేసింది 160 కోట్ల రూపాయలేనని టాక్ కూడా వినిపిస్తోంది. అయితే కలెక్షన్స్ తొందరపాటులో ఇలా మేకర్స్ చేయడం కరెక్ట్ కాదనే టాక్ కూడా వినిపిస్తోంది. అలాగే తెలుగురాష్ట్రాల్లో అత్యధిక టికెట్ ధరలు
కూడా ‘సలార్:సీజ్ఫైర్’ చిత్రం160 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌కు దోహదం చేశాయని తెలుస్తోంది. మరోవైపు ఓవర్సీస్లో ‘సలార్:సీజ్ఫైర్’ సినిమాకు భారీ స్పందన లభిస్తోంది. ప్రీమియర్స్‌తో కలుపుకుని ‘సలార్:సీజ్ఫైర్’ చిత్రం ఓవర్సీస్లో విడుదలైన తొలిరోజే 6మిలియన్‌డాలర్లను కలెక్ట్ చేసిందని తెలిసింది.ప్రభాస్ ‘బాహుబలి’ ఓవర్సీస్లో 7 మిలియన్ డాలర్లు, ‘బాహుబలి 2’ 20 మిలియన్ డాలర్స్‌ను వసూలు చేసింది. మరి..ఈ విషయంలో ‘సలార్’ కొత్త రికార్డులు సృష్టిస్తుందో లేదో చూడాలి.
Prabhas and PrashanthNeel Salaar CeaseFire: ప్రభాస్ సలార్:సీజ్ఫైర్ రివ్యూ
శుక్రవారం తొలిరోజే ‘సలార్:సీజ్ఫైర్’ చిత్రం మేకర్స్ చెప్పినట్లుగా 180 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లయితే, శనివారం, ఆదివారం వీకెండ్స్ కాబట్టి ‘సలార్:సీజ్ఫైర్’ చిత్రం వసూళ్లు మరింత స్ట్రాంగ్‌గా ఉంటాయి. తొలివీకెండ్లో ‘సలార్:సీజ్ఫైర్’ చిత్రం 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అప్పుడు ‘సలార్’ సినిమా తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక ప్రభాస్‌తో పాటుగా పృథ్వీరాజ్‌సుకుమారన్, శ్రుతీహాసన్, శ్రీయారెడ్డి, ఈశ్వరీ రావు, జగపతిబాబు, బాబీసింహా, రామకృష్ణరాజు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్‌కిరగందూర్ ‘సలార్’ సినిమాను నిర్మిసు ్తన్నారు. ఇక ‘సలార్’లోని మలిభాగం ‘సలార్:శౌర్యాంకా పర్వం’ గా రానుంది. మరోవైపు విడుదలైన తొలిరోజే దాదాపు 230 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు రికార్డు ఉన్న సంగతి తెలిసిందే.
Prashanthneel: నిజమే…కన్నడ ‘ఉగ్రం’కు ‘సలార్’ రీమేక్: దర్శకుడు ప్రశాంత్ నీల్