హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్‌నీల్ కాంబినేషన్లో ‘సలార్’ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి, 2014లో వచ్చిన కన్నడ ఫిల్మ్ ‘ఉగ్రం’కు తెలుగు రీమేక్ అన్నమాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ‘ఉగ్రం’ సినిమాకు కూడా ప్రశాంత్నీల్యే దర్శకుడు. కానీ ‘ఉగ్రం’ ఆధారంగా ‘సలార్’ను తెరకెక్కిస్తున్నట్లుగా ప్రశాంత్ నీల్ గతంలో ఎప్పుడూ చెప్పలేదు. ప్రశాంత్‌నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ 2021లో ఓ సందర్భంగా…‘ఉగ్రం’ సినిమా రీమేక్‌గా ‘సలార్’ రూపుదిద్దుకుంటు న్నట్లుగా చెప్పినా, ఎందుకో పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. బహుశా..రవి బస్రూర్ కన్నడ భాషలో ఈ విషయాన్ని చెప్పడం వల్ల కాబోలు.
తాజాగా ‘ఉగ్రం’ సినిమాకు అప్డేటెడ్ వెర్షన్ ‘సలార్’ అంటూ ఈ విషయంపై స్పందించారు ప్రశాంత్‌నీల్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ–‘‘2014లో ‘ఉగ్రం’ విడుదలైనప్పుడు, ఈ సినిమాకు పెద్ద ఆదరణ లభించదు. థియేటర్స్ నిండలేదు. కానీ ప్రేక్షకులు చూడదగ్గ సబ్జెక్ట్ ఇది. కాబట్టి…‘ఉగ్రం’ కథను రీ రైట్ చేసి ‘సలార్’ తీశాను. ఈ విషయంలో ఆడియన్స్ నన్ను ఎమనుకున్నా ఫర్వాలేదు. చెప్పాలంటే ‘కేజీఎఫ్’ తర్వాత నా స్కిల్స్ పెరిగాయి. స్టోరీ టెల్లింగ్‌లో నాకు అనుభవం పెరిగింది. ‘సలార్’లో ‘ఉగ్రం’, ‘కేజీఎఫ్’లు ప్రతిభింభిస్తున్నాయని, ఎవరైనా అనుకున్నప్పటికీని నాకు ఏం బాధ లేదు. ‘సలార్’ నా కోసం తీసిన సినిమా. ప్రభాస్సార్, నిర్మాతలకు థ్యాంక్స్’’ అని చెప్పుకొచ్చారు ప్రశాంత్‌నీల్. అయితే ఈ విషయాన్ని ఇంతవరకు దాచాల్సిన విషయం ఏముందని, ముందే చెప్పకుండ ఇలా రీలీజ్ సమయంలో చెప్పడం ఏంటని కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ పెదవివిరుస్తున్నారు.
The confidence & clarity of thought of #PrashantNeel #Salaar #Prabhas #Ugramm #SalaarCeaseFire pic.twitter.com/MmVXY7ADWF
— Aryan (@chinchat09) December 21, 2023
Aaaah #ugramm ey ee #Salaar laga mali vachindi raaa
Salaaarr remake of ugramm
— Magi Reddy_Chowdhary (@magimaggi7) December 18, 2023
#Salaar – Remake of #Ugramm With Same Dialoguespic.twitter.com/RoPh787dsa
— Hemanth Kiara (@ursHemanthRKO) December 21, 2023
ఇక ‘సలార్’ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలిభాగం ‘సలార్:సీజ్ఫైర్’ డిసెంబరు 22న విడుదలవుతుంది. ఈ సినిమాలో హీరో దేవాగా ప్రభాస్, దేవా ప్రాణస్నేహితుడు వరదరాజమన్నార్‌గా పృథ్వీరాజ్‌సుకుమారన్, దేవా ప్రేయసి ఆద్యగా శ్రుతీహాసన్, రాజా మన్నార్‌గా జగపతిబాబు నటించారు. విజయ్ కిరగందూర్ నిర్మించారు. ప్రభాస్ హీరోగా నటించిన గత చిత్రాలు ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ చిత్రాలకు పెద్దగా ఆదరణ నోచుకోలేని ఈ పరిస్థితుల్లో ‘సలార్:సీజ్ఫైర్’ హిట్ ప్రభాస్ కెరీర్‌కు ఎంతో కీలకం.