హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్‌నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘సలార్’. ఈ సిని మాలోని తొలిపార్టు ‘సలార్:సీజ్ఫైర్’ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఇందులో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్‌సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు. ‘సలార్:సీజ్ఫైర్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నప్పటికీని ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. కానీ ఇటీవల ‘సలార్:సీజ్ఫైర్’ నుంచి విడుదలైన ‘సూరీడు’ పాట ప్రేక్షకులకు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ‘సలార్’ సినిమాపై మళ్లీ అంచనాలు పెరిగాయి. రవిబస్రూర్ సంగీత దర్శకుడు. కాగా ‘సూరీడు’ పాట తెలుగు వెర్షన్‌కు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. హరిణి పాడారు.
‘సలార్:సీజ్ఫైర్’ చిత్రం ప్రధానంగా స్నేహం నేపథ్యంలో సాగుతుంది. ప్రభాస్, పృథ్వీరాజ్సుకుమారన్ల మధ్య ఉండే స్నేహాం ఈ సినిమాలో హైలైట్‌గా ఉంటుంది. కానీ అదే సమయంలో వీరిద్దరూ శత్రువులైతే ఎలా ఉంటుందనేది సెకండ్పార్టులో ఉంటుందట. ‘సలార్’ సినిమాను హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. గతంలో ‘కేజీఎఫ్’, ‘కాంతార’ సినిమాలను నిర్మించింది ఈ సంస్థే కావడం విశేషం.