దర్శకుడు హరీష్‌శంకర్ తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన చిత్రం ‘షాక్’. ఇందులో రవితేజ హీరోగా నటించారు. కానీ ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో హరీష్‌శంకర్‌కు ఇండస్ట్రీలో అప్పట్లో మళ్లీ దర్శకుడిగా అవకాశాలు రాలేదు. కానీ హరీష్‌పై నమ్మకంతో రవితేజ రెండో అవకాశం ఇచ్చారు. మిరప కాయ్ వంటి మాస్ కమర్షియల్ తీశారు హరీష్‌శంకర్. ఈ సినిమా సూపర్‌హిట్. దీంతో హరీష్‌శంకర్ కెరీర్ దర్శకుడిగా ట్రాక్‌లో పడింది. అగ్రహీరోలతో సినిమాలు చేశారు. తాజాగా హీరో రవితేజ, హరీష్‌శంకర్ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి మరో సినిమా తెరకెక్కనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించనుంది. హిందీ హిట్ ‘రైడ్’కు తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. రీమేక్ సినిమాల స్పెషలిస్ట్‌గా హరీష్‌శంకర్‌కు ఇండస్ట్రీలో పేరుంది. మరి..ఈ సినిమాను ఏ రేంజ్లో తీస్తారో చూడాలి.
మరోవైపు గోపీచంద్ మలినేనితో రవితేజ చేయాల్సిన సినిమా క్యాన్సిల్ కావడం, ఇటు పవన్‌కళ్యాణ్‌తో హరీష్‌శంకర్ చేస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రం తాత్కాలికంగా వాయిదా పడటం వంటి అంశాల నేపథ్యంలో రవితేజ–హరీష్‌శంకర్‌ల కాంబినేషన్ సెట్ అయినట్లు తెలుస్తోంది.