రానాకు ‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి సూపర్‌హిట్ ఫిల్మ్‌ను అందించాడు దర్శకుడు తేజ. తాజాగా రానా, తేజ కాంబినేషన్లో మరో చిత్రం ప్రారంభం కానుందని, రెండు సంవత్సరాల క్రితమే ఓ ప్రకటన వచ్చింది. ‘రాక్షసరాజు రావణాసురుడు’ అనే టైటిల్ కూడా తెరపైకి వచ్చింది. రెండు సంవత్సరాల క్రితం తేజ బర్త్డేసందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. కానీ డిసెంబరు 14న రానా బర్త్ డే సందర్భంగా రానా–తేజకాంబినేషన్లోని సినిమాకు ‘రాక్షసరాజా’ అనే టైటిల్ ఖరారైనట్లు, ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కన్నట్లుగా చిత్రంయూనిట్ వెల్లడించింది. ఈ సినిమాను గురించి మరిన్ని వివరాలు వెల్లడికావాల్సిఉన్నాయి. మరోవైపు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘వేట్టయ్యాన్’ చిత్రంలో ఓ కీ రోల్ చేస్తున్నారు రానా.అలాగే దుల్కర్‌సల్మాన్‌తో ఓ సినిమాను నిర్మిస్తున్నారు రానా.
ఈ సంగతి ఇలా ఉంచితే..తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా రానా చెప్పుకునే ‘హరిణ్యకశ్యప’ చిత్రంపై మరో అప్డేట్ రావాల్సి ఉంది. ఈ సినిమాకు తొలుత గుణశేఖర్ దర్శకత్వం వహిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, డైలాగ్స్ అందించనున్నట్లుగా రానా ఓ సందర్భంగా వెల్లడించారు. సో..‘హరిణ్యకశ్యప’ సినిమా దర్శకుడిపై మరో క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే రానా హీరోగా తమిళ దర్శకుడు ‘మిలింద్ రావ్ ఓ సినిమా చేయన్నట్లు గతంలో ప్రకటన వచ్చింది. కానీ ఈ సినిమా ఇంకా కార్యరూపం దాల్చలేదు.