నాగార్జున హీరోగా నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. ‘అల్లరి’ నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆషికా రంగనాథ్ హీరోయిన్. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు నాగార్జున. మలయాళంలో సూపర్‌హిట్ సాధించిన ‘పొరింజు మరియమ్ జోష్’ సినిమా తెలుగు రీమేక్‌గా ‘నా సామిరంగ’ సినిమా విడుదలవుతోంది. యాక్షన్, స్నేహం, రొమాంటిక్ అంశాలతో ఈ సినిమా కథనం సాగుతుంది.