Prabhas Ravanam: హీరో ప్రభాస్, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘దిల్’ రాజు ‘రవణం (Ravanam)’ సినిమాను నిర్మించనున్నారు. మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. అయితేహీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్‌నీల్ కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాతనే రవణం సినిమా ఉంటుందని, ఈ ప్రాజెక్ట్‌ను గురించి వారం రోజుల క్రితమే ప్రభాస్‌తో డిస్కస్ చేయడం జరిగిందని కూడా ‘దిల్’ రాజు చెప్పుకొచ్చారు.
ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘రాజా డీలక్స్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాల తర్వాత అర్జున్‌రెడ్డి ‘ఫేమ్’ సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్లో ‘స్పిరిట్’(Spirit) చేస్తారు. ‘స్పిరిట్’ సినిమాను కొనసాగిస్తూనే సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు ప్రభాస్. వీటి తర్వాత ప్రశాంత్‌నీల్‌తో ‘సలార్ 2’ ఉండనే ఉంది. ఈ సినిమాలన్నీ పూర్తయి రిలీజ్ కావడానికి కనీసం ఐదు సంవత్సరాలు పడుతుంది. ఈ లోపు ఎన్టీఆర్‌తో మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్లో సినిమా చేస్తారు ప్రశాంత్‌నీల్. ఈ సినిమాకంటే ముందు వార్ 2ను ఎన్టీఆర్ కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈ విషయాలన్నింటి గమనిస్తుంటే …రవణం థియేటర్స్‌లో వచ్చేది( సినిమా షూటింగ్ జరుపుకుని, పూర్తయితే) 2030లోనే అన్నట్లుగా తెలుస్తుంది.