ప్రభాస్ కెరియర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా ‘సలార్’. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ సినిమాలోని తొలి పార్ట్ ‘సలార్ :సిజ్ ఫైర్’ ఈ నెల 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ప్రభాస్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది అనే టాక్ విని పిస్తుంది. కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ నటుడు పృధ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ కనిపిస్తారు. ‘కేజి ఎఫ్’, ‘కాంతారా’ వంటి సినిమాలను నిర్మించిన విజయ్ కిరగంధూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సలార్ సినిమా.. ఇద్దరి వ్యక్తుల మధ్య ఉన్న స్నేహం వైరంగా మారితే ఎలా ఉంటుందని నేపథ్యంలో సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ పాయింట్ ఇండియన్ సినిమాలో పాత అయినప్పటికీ దీనికి ప్రశాంత్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి ఆడియన్స్ లో ఉంది. అమ్మకి ఇచ్చిన మాట, మిత్రుని సంరక్షణ.. ఈ రెండు అంశాల మధ్య ప్రభాస్ పాత్ర సంఘర్షణకు గురవు తుందని తెలుస్తోది.