ప్రధానతారాగణం: రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ
దర్శకత్వం, ఎడిటింగ్: సందీప్ రెడ్డి వంగా
నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ ఖేతని, క్రిషణ్‌కుమార్
ఆర్ఆర్: హర్షవర్ధన్ రామేశ్వర్
కెమెరా: అమిత్రాయ్
విడుదల: డిసెంబరు 01, 2023
ముగ్గురు అన్నదమ్ముల వారసత్య ఆస్తుల పంపకాలు, హక్కుల నేపథ్యంలో ‘యానిమల్’ సినిమా కథనం ఉంటుంది. కానీ ఈ సినిమా కథను అంతా కేవలం రణ్విజయ్ సింగ్ క్యారెక్టరైజేషన్‌పై మాత్రమే బిల్డ్ చేశారు దర్శకుడు సందీప్‌వంగా. తండ్రి హత్యాయత్నం ప్రయత్నంలో తన బావ వరుణ్ ప్రేమయంఉందని, అతన్ని రణ్విజయ్ చంపేయడం, స్కూల్టైమ్లో తనను అన్నయ్య అని పిలిచిన గీతాంజలికి‘ఆల్ఫా’ స్టోరీ చెప్పి, ఆమెనే వివాహం చేసుకోవడం వంటి అంశాలు రణ్విజయ్ సింగ్ పాత్రలోని దుందుడుకు స్వభావాన్ని వ్యక్తం చేస్తాయి. సినిమా లవ్‌స్టోరీతోనే మొదలైన ప్పటికీని, బల్బీర్ హాత్యాయత్నం తర్వాత వేగం పుంజుకుంటుంది. శత్రువుల్లో ఒకరైన అసర్(పృథ్వీ)ను చంపడం, ఈ క్రమంలోని ఇంట్రవెల్ ఫైట్ఆసక్తిగా అనిపిస్తాయి. కానీ ప్రధాన శత్రువు ఎవరో సెకండాఫ్‌లో తెలియాలి. కానీ కథ ఇక్కడ నెమ్మ దిస్తుంది. అసర్ను చంపే సమయంలో రణ్విజయ్కు బుల్లెట్స్ తగలడం, అతను కోలుకునే క్రమం..ఇలాసెకండాఫ్లోని మేజర్ పార్ట్ అంత చప్పగా సాగుతుంది. ఎప్పుడైతే శత్రువు గూఢచారి జోయా వచ్చారోఅప్పట్నుంచి కథ కాస్త ముందుకు వెళ్తుందనిపిస్తుంది కానీ వేగం ఉండదు. ఈ సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని టెస్ట్ చేస్తాయి. కానీ ఎప్పుడైతే జోయా ద్వారా తన ప్రధాన శత్రువు అబ్రార్ అని, అతని తన బాబాయ్ కొడుకు అని, అబ్రార్(బాబీడియోల్), అసర్, అజీజ్ అన్నదమ్ములని, తనకు వారు అన్నదమ్ములు అవుతారని రణ్ విజయ్ తెలుసు కుంటాడో అప్పుడు కథలో వేగం పెరిగి, క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. ఈ సినిమాలో విపరీతమైన హింసాత్మక సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. లోదుస్తుల ప్రాముఖ్యత గురించి,హీరో వీలైనప్పుడల్లా స్పీచ్‌లు ఇవ్వడం, ఓ సన్నివేశంలో న్యూడ్‌గా కనిపించడం అనేవి..ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు దూరంగా ఉండాలని చెప్పే నిదర్శనాలు.
కథ ప్రధానంగా రణ్‌వీర్‌సింగ్, అనిల్‌కపూర్, రష్మికా మందన్నాల చూట్టే తిరుగుతుంది. రణ్విజయ్ పాత్రలో రణ్‌బీర్‌కపూర్ బాగా యాక్ట్ చేశాడు. డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో విభిన్న రకాల గెటప్స్‌లో రణ్‌బీర్ కనిపించడం యాక్టింగ్ పట్ల అతనికి ఉన్న కమిట్మెంట్ను తెలియజేస్తుంది. యాక్షన్ పరంగా ఇంట్రవెల్లో వచ్చే సీన్, ఎమోషనల్ పరంగా అనిల్‌కపూర్, రష్మికామందన్నాలతో సెకం డాఫ్లోని సన్నివేశాలు రణ్‌బీర్ కపూర్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకువెళ్లాయనిపిస్తుంది. అనిల్‌కపూర్ తన యాక్టింగ్ ప్రతిభనంత చూపించారు.రష్మికా మందన్నాకు మంచి స్క్రీన్ స్పేస్ లభించింది. సెకండాఫ్‌లో రణ్‌బీర్‌కపూర్‌తో వచ్చే సన్నివేశాల్లోరష్మికా మందన్నా బాగా చేసింది. అయితే రష్మికా గొంతు నుంచి అశ్లీల పదాలు వినడం అనేది తెలుగు ప్రేక్షకులకు కాస్త మింగుడుపడని విషయం. ఇక అబ్రార్‌గా బాబీ డియోల్, అసర్గా పృథ్వీ ఒకే. జోయా త్రిపాఠికి పెద్ద యాక్టింగ్ స్కోప్ లేదు. కేవలం హీరో క్యారెక్టరైజేషన్‌తోనే సినిమా కథ అల్లుకున్నారు సందీప్‌రెడ్డి వంగా. కానీ మూడుకుటుంబాల కథను చెబుతున్నప్పుడు ఆ సన్నివేశాలను మరింత ఎస్లాబ్లిష్ చేయాల్సిన బాధ్యత దర్శకుడుపై ఉంటుంది. బల్బీర్‌సింగ్ అన్నదమ్ములుగా ఎందుకు విడిపోయారనే సన్నివేశాలను సరిగా ఎస్టాబ్లిష్ కావు. అలాగే తన సొంత మామయ్య బల్బీర్సింగ్తో వరుణ్ ఎందుకు విభేదిస్తాడో, ఏ లక్ష్యంతో అసర్‌తో చేతులు కలుపుతాడో.. అన్న సీన్స్ సినిమాలో ఉండకపోవడం మరో మైనస్. కానీ సినిమా నిడివి మూడు గంటలు ఉండటం మరో మైనస్.దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాయే ఈ సినిమాకు ఎడిటర్ కూడా కావడంతో తన సన్నివేశాలను తానే ఎడిట్ చేసుకోలేకపోయారెమో.జోయా ఎపిసోడ్, రణ్‌విజయ్‌సింగ్ రికవరీ అవ్వడం, భార్య గీతాంజలితో రణ్విజయ్ పదే పదే గొడవ పడటం, లోదుస్తుల గురించి హీరో డైలాగ్స్.. వంటి సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్యాగ్రౌండ్ మ్యూజిక్. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన ఆర్ఆర్ అదుర్స్ అనిపించింది. ముఖ్యంగా ఇంట్రవెల్ సీన్. సాంగ్స్, నిర్మాణవిలువలు బాగున్నాయి. కెమెరా వర్క్‌ను తక్కువ చేయలేం.
బలాలు
రణ్‌బీర్‌కపూర్ క్యారెక్టరైజేషన్
ఇంట్రవెల్ యాక్షన్ సీన్
బ్యాగ్రౌండ్ స్కోర్
బలహీనతలు
సెకండాఫ్‌లో సాగదీత సన్నివేశాలు
సినిమా నిడివి
మితిమీరిన ఆశ్లీల, హింసాత్మక సన్నివేశాలు
– డర్టీ యానిమల్(2.25)