‘బాహుబలి’ తర్వాత ‘బాహుబలి’ స్థాయి హిట్‌ను ప్రభాస్ అందుకోలేకపోయాడు. ఈ సినిమాతో తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ ఒకే అనిపించిన, ప్రభాస్ స్థాయిలో సూపర్‌హిట్ కాలేకపోయింది. ఈ నెక్ట్స్ వచ్చిన ప్రభాస్ చిత్రాలు ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ముఖ్యంగా ‘ఆదిపురుష్’ సినిమా ప్రభాస్‌ను బాగా ఇబ్బంది పెట్టింది.ఈ సినిమా కనీస వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. ప్రభాస్ కెరీర్లో డిజాస్టర్‌గా నిలిచింది.
ఈ తరుణంలో ప్రభాస్ ఆశలు అన్ని ‘సలార్’పైనే ఉన్నాయి. ఇటు ఫ్యాన్స్ కూడ ప్రభాస్ ‘సలార్’ బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నారు. కానీ నెల రోజుల క్రితం వరకు ‘సలార్’నుంచి ఏటువంటి కంటెంట్ రాలేదు. ఈ నెల 22న విడుదల కానున్న ‘సలార్’ తొలిపార్టు‘సలార్: సీజ్ఫైర్’ ట్రైలర్‌ను కూడా ఆడియన్స్‌కు, ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఒకే అనిపించినా,వారి అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. కానీ ఎప్పుడేతే ప్రభాస్ ‘సలార్:సీజ్ఫైర్’ చిత్రం నుంచి ‘సూరీడు’ ఎమోషనల్సాంగ్ వచ్చిందో అప్పుడు ‘సలార్’పై బ్లాక్‌బస్టర్‌పై ఆశలు చిగురించాయి. ఈ క్రమంలోనే ‘సలార్:సీజ్ఫైర్’ ట్రైలర్ రాగానే ఒక్కసారిగా లెక్కలు అన్ని మారిపోయాయి. ‘సలార్:సీజ్ఫైర్’ చిత్రం బ్లాక్‌బస్టర్ అనేంత స్టామినా ఈ రిలీజ్ ట్రైలర్లో కనిపించింది. ప్రభాస్ యాక్టింగ్, స్టామినాలో ఫైర్ కనిపించింది. ‘సలార్:సీజ్ఫైర్’హిట్‌తో అభిమానులకు బాకీ ఉన్న బ్లాక్‌బస్టర్‌ను ఇచ్చేసేలాకనిపిస్తున్నాడు ప్రభాస్.
దేవ, వరదరాజ మన్నార్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎందుకు బద్దశత్రువులుగా మారారు? అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందని విడుదలైన ‘సలార్: సీజ్ఫైర్’ ట్రైలర్స్ స్పష్టం చేస్తున్నారు. మెకానిక్ దేవగా ప్రభాస్, వరదరాజ మన్నార్‌గా మలయాళ నటుడు పృథ్వీరాజ్‌సుకుమారన్, హీరోయిన్ ఆద్యగా శ్రుతీహాసన్, రాజమన్నార్‌గా జగపతిబాబు, టీనూ ఆనంద్, ఈశ్వరీరావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘సలార్:సీజ్ఫైర్’ చిత్రం ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి2898ఏడీ’, మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’, సినిమాలు చేస్తున్నారు ప్రభాస్. అలాగే ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సందీప్రెడ్డివంగాతో ‘స్పిరిట్’ మూవీ కమిట్ అయ్యారు ప్రభాస్. ఈ సినిమాలో ప్రభాస్ పోలీసాఫీసర్‌గా నటిస్తారు.