Prabhas: తెలుగువారి ఫెవరెట్ ఫెస్టివల్ సంక్రాంతి సీజన్‌కు సినిమాలను రిలీజ్ చేయాలని ఆయా హీరోలు తాపత్ర యపడుతుంటారు. ఈ సీజన్లో రిలీజై ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమాలూ కూడ ఉన్నాయి. అందుకేఅంత పోటీ మరి. వివిధ సమీకరణాల దృష్ట్యా సంక్రాంతికి ఓ సినిమాను రిలీజ్ చేయాలంటే చాలా కష్టం. కానీ ఏ హీరో వారికి వీలైనప్పుడు ఏదో ఒక ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాడు. కానీ ఒక్క ప్రభాస్మాత్రం రెండు సంక్రాంతికి సినిమాలను రిలీజ్ చేయలేకపోతున్నాడు.
బాహుబలి, సాహో వంటి యాక్షన్ ఎంటర్టైనర్స్ తర్వాత ప్రభాస్ చేసిన ప్వూ్యర్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’. పూజాహేగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు కే. రాధాకృష్ణకుమార్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్నిర్మించింది. ఈ సినిమాను తొలుత 2022 జనవరి 14న అంటే సంక్రాంతి పండగ రోజున రిలీజ్ చేయాలనుకున్నారు కుదర్లేదు. ఫైనల్‌గా 2022 మార్చి 11న విడుదలైంది. రాజమౌళి దర్శకత్వంలోని ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను జనవరి 7, 2022న రిలీజ్‌కు ప్రకటించారు. సో..ప్రభాస్ రాధేశ్యామ్వాయిదా పడింది. అలాగనీ ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతికి రీలీజ్ కాలేదు. మార్చి 25న ప్రేక్షకుల ముందుకువచ్చింది. ప్రభాస్‌కు సంక్రాంతి చాన్స్ మిస్ అయ్యింది.
ఇక 2023 సంక్రాంతికి ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. 2023 జనవరి 12న రిలీజ్ డేట్ ప్రకటించారు. రామాయణం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా వాయిదా పడి ఇప్పుడుజూన్ 16 రిలీజ్‌కు రెడీ అవుతోంది. విడుదలైన ఆదిపురుష్ సినిమా టీజర్ ఆసక్తికరంగా లేదు. ముఖ్యంగాప్రభాస్ లుక్, వీఎఫ్ఎక్స్ లపై వీపరీతమైన విమర్శలు వచ్చాయి. ఇలా 2023కు కూడా ప్రభాస్ సినిమా సంక్రాంతికి రాలేదు.
ఇప్పుడు చేస్తున్న మరో సినిమా ‘ప్రాజెక్ట్ కె’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనేఅత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. ఈ సినిమాను జనవరి 12, 2024న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రభాస్అండ్ టీమ్ ప్రకటించింది. కానీ ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ వాయిదా పడేలా కనిపిస్తుంది.
ఇలా రెండు దశాబ్దాలుగా ప్రభాస్‌కు సంక్రాంతి రిలీజ్ కలిసి రావడం లేదు. గతంలో ప్రభాస్ చేసిన యోగి(2007), వర్షం(2014) చిత్రాలు సంక్రాంతికి రిలీజై హిట్స్ సాధించాయి. ముఖ్యంగా వర్షం చిత్రం ఎంతటి సూపర్‌డూపర్ హిట్టో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి..ప్రభాస్ సినిమా మళ్లీ ఎప్పుడు సంక్రాంతికి రిలీజ్ అవుతుందో చూడాలి.
Daksha Nagarkar: ‘రావణాసుర’లో నా పాత్ర చాలా సర్ ప్రైజింగ్ గా వుంటుంది : దక్షా నాగర్కర్