The Raja saab: ప్రభాస్ (Prabhas) ‘రాజాసాబ్’(The Raja saab) సినిమా 2025 సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయన్నట్లుగా ఈ చిత్రం నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పరోక్షంగా పేర్కొన్నారు. దీంతో 2025 సంక్రాంతికి ‘రాజాసాబ్’ (The Raja saab) థియేటర్స్‌కు వస్తాడా? అనే చర్చ జోరుగా సాగుతుంది ఇండస్ట్రీలో. కానీ సంక్రాంతి సమయంలో ప్రభాస్ సినిమాల రిలీజ్ విషయాల పరిణామాలను గమనిస్తే 2025 సంక్రాంతికి రాజాసాబ్ రాకపోవచ్చు.
ప్రభాస్‌కు సంక్రాంతి రిలీజ్ కలిసి రావడం లేదు
ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాను తొలుత 2022 జనవరి 14న సంక్రాంతి సందర్భంగా థియేటర్స్‌లో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ చిత్రం ఫైనల్‌గా 2022 మార్చి 11న థియేటర్స్‌లోకి వచ్చింది. సేమ్…2023 సంక్రాంతికి ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయాలనుకున్నారు. కానీ ‘ఆదిపురుష్’ చిత్రం జూన్ 16న థియేటర్స్‌లో విడుదల కాలేదు. అలాగే 2024 సంక్రాంతికి ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’(Kalki2898AD) సినిమాను జనవరి 12, 2024కి విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ చిత్రం మే 09, 2024 విడుదలకు సిద్ధం అవుతోంది. ఇలా ప్రభాస్ చిత్రం సంక్రాంతికి విడుదల అవుతుందనుకున్న ప్రతిసారి డార్లింగ్ ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. రిలీజ్ కూడా సాధ్యపడలేదు. ఈ తరుణంలో ‘రాజాసాబ్’ సంక్రాంతికి విడుదల కావడం దాదాపు అసాధ్యం. పైగా ‘కల్కి2898ఏడీ’ సినిమా మే 09న విడుదల కాబట్టి ఈ సినిమా షూటింగ్‌ను ప్రభాస్ ముందు పూర్తి చేయాలి. ఈ సినిమా ప్రమోషన్స్ సమయం కేటాయించాలి. దీనికి తోడు ‘సలార్ 2’ వెంటనే సెట్స్‌కు తీసుకుని వెళ్లి 2025లో విడుదల చేయాలని ప్రశాంత్‌నీల్ పట్టుబడు తున్నాడు. ‘సలార్ 2’ షూటింగ్లో కూడా ప్రభాస్ పాల్గొనాలి. ఇలా ‘రాజాసాబ్’ చిత్రీకరణ నెమ్మదిగా సాగవచ్చు. ఇదే జరిగితే సంక్రాంతికి షూటింగ్‌ను పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ను కంప్లీట్ చేసుకుని ‘రాజాసాబ్’ థియేటర్స్‌కు రావడం దాదాపు అసాధ్యమే.
Prabhas: ప్రభాస్‌కు సంక్రాంతి కలిసి రానట్లేనా?
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ చిత్రంలో సంజయ్‌దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. నిధీఅగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దికుమార్ కీలక పాత్రధారులు. పీపుల్ మీడియాఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఇక ప్రభాస్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘వర్షం’ 2004లో , ‘యోగి’ సినిమా 2007లో విడుదలై య్యాయి. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా చేసిన ఏ సినిమా కూడా సంక్రాంతికి విడుదల కాలేదు.