TheRajasaab Prabhas: ప్రభాస్ (Prabhas) పెళ్లి టాప్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఓ హాట్ టాపిక్. ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్రభాస్ పెళ్లిని గురించి ఆయన ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఆదిపురుష్’ సినిమా సమయంలో ప్రభాస్–కృతీసనన్లు పెళ్లి చేసుకోనున్నారనే పుకార్లు వినిపించాయి. కానీ ఇవి పుకార్లుగానే మిగిలిపోయాయి. ఒక ఎప్పట్నుంచో ప్రభాస్– అనుష్కాశెట్టిల వివాహం అంటూ గాసిప్ రాయుళ్లు మాట్లాడుకుంటూనే ఉన్నారు. అయితే ప్రభాస్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. కానీ రియల్‌గా కాదు. రిల్ లైఫ్‌లో అన్నమాట.
ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలో ‘రాజా సాబ్’ ఒకటి. మారుతి దర్శకుడు. కథ రిత్యా ఈ సినిమాలో ఓ పెళ్లి సీన్ ఉందట. ఈ సీన్ కోసం ప్రభాస్ పెళ్లి పీటలెక్కబోతున్నాడని ఫిల్మ్‌నగర్ భోగట్టా. మాళవిక మోహనన్, రిద్ది కుమార్, నిధీ అగర్వాల్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. ‘రాజా సాబ్’తో పాటు ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లోని ‘కల్కి 2898ఏడీ’ సినిమా మే 9న విడుదల కానుంది. త్వరలోనే ‘సలార్ 2’ సెట్స్‌లో జాయిన్ అవుతారు ప్రభాస్. అలాగే ‘అర్జున్‌రెడ్డి’, ‘యానిమల్’ సినిమాల దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాతో ప్రభాస్ ‘స్పిరిట్’ అనే సినిమా కమిటైయ్యాడు. ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం అవుతుంది. హనురాఘవపూడితో కూడా ప్రభాస్ ఓ సినిమా చేస్తారనే ప్రచారం సాగుతోంది.
JrNTR-Ramcharan: ఎన్టీఆర్..రామ్‌చరణ్‌లకు నో చెప్పారు!