Kalki2898ADStory: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki2898AD) సినిమాను గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైంటిఫిక్ అండ్ ఫ్యూచరిస్ట్ యాక్షన్ ఫిల్మ్మే 9న విడుదల కానుంది. అయితే ఈ సినిమా కథనం ఎలా ఉండబోతోంది? అనే చర్చ ఇండస్ట్రీలో సాగుతోంది. ఈ సినిమాకు విష్ణుతత్త్వం ఉంటుందని ఆల్రెడీ ఈ సినిమా నిర్మాత సి. అశ్వనీదత్ ఓ సందర్భంగాచెప్పారు.కానీ ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ సినిమాను గురించి మరిన్ని విషయాలు సోషల్‌మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి.
ఈ సినిమాకు తాను పనిచేశానంటూ కేశవ చంద్ర అనే రైటర్ చెప్పుబుతున్నారు. అంతేకాదు…ఈ కథను తొలిసారి తాను కమల్‌హాసన్‌కు చెప్పినట్లుగా, ఓ ఫ్రాంచైజీల ఈ సినిమా కథనం ఉంటుందని, కల్కి 2898 ఏడీ కంటే…తనకు ‘ప్రాజెక్ట్ కె’అనే టైటిల్ నచ్చిందని చెప్పుకొచ్చారు కేశవచంద్ర. ‘కల్కి 2898ఏడీ’ సినిమాలో మహాభారతం, రామాయణం….ఈ రెండు కాన్సెప్ట్స్ కూడా ఉంటాయని చెబు తున్నారు కేశవ చంద్ర. లార్డ్ విష్ణు పదవ అవతారం ‘కల్కి’కి ఈ సినిమా కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు శేఖర్ చంద్ర. ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటంటే….‘కల్కి 2898 ఏడీ’ సినిమా విషయంలో చిత్రం యూనిట్ తో తనకు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని కేశవ చంద్ర సోషల్‌మీడియా పోస్ట్‌లో షేర్ చేసుకున్నారు. అలాగే తాను గతంలో ‘విరూపాక్ష’ సినిమాకు వర్క్ చేశారని, ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’, రానా ‘హిరణకశ్యప’ సినిమాలకు వర్క్ చేస్తున్నట్లుగా కేశవ చంద్ర పేర్కొంటున్నారు.
ప్రస్తుతం ‘కల్కి 2898ఏడీ’ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రభాస్, దిశాపటానీలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అమితాబ్‌బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకొనె ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, నాని, దుల్కర్సల్మాన్, విజయ్‌దేవరకొండ, దర్శకుడు రాజమౌళి కీలక పాత్రల్లో నటించారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. డిఫరెంట్ పార్టులుగా ఈ చిత్రం రాబోతున్నట్లుగా తెలుస్తోంది.