JaiHanuMan: ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘హనుమాన్’(HanuMan) సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద 300 కోట్లరూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టింది ఈ సినిమా. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె. నిరంజన్‌రెడ్డి నిర్మించిన చిత్రం ఇది. ‘హనుమాన్’ బ్లాక్‌బస్టర్ సాధించడంతో , ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ (JaiHanuMan) ప్రకటించారు దర్శకుడు ప్రశాంత్‌వర్మ. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలైంది. ఈ సినిమాలోని రాముని పాత్రకు మహేశ్‌బాబు, హనుమాన్ పాత్రకు చిరంజీవిఅయితే బాగుంటుందని ఈ చిత్రం దర్శకుడు ప్రశాంత్‌వర్మ తన మనసులోని మాటను చెప్పారు. కాగా ఈ సినిమాను గురించిన మరో అప్డేట్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అదీ ఏంటంటే.. ‘జైహనుమాన్’ టైటిల్‌ను ఆల్రెడీ ఎవరో రిజిస్టర్ చేశారట నార్త్‌లో. దీంతో ‘హనుమాన్’ నిర్మాత ‘ఓం జై హనుమాన్’అనే టైటిల్‌ను రిజిస్టర్ చేశారని ఫిల్మ్‌నగర్ టాక్. త్వరలోనే ఈ సినిమాను గురించిన మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. అలాగే శ్రీరాముడు–హనుమాన్ నేపథ్యాలతో హిందీలో కన్నడంలో వరుస సినిమాలు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.