JaiHanuMan: ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘హను–మాన్’ సినిమా సూపర్‌డూపర్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తేజా సజ్జా హీరోగా నటించిన ఈసినిమాకు ప్రశాంత్‌వర్మ దర్శకుడు. ‘హను–మాన్’ సినిమా సూపర్‌హిట్ కొట్టడంతో వెంటనే తన నెక్ట్స్మూవీగా ‘జై హనుమాన్’ సినిమాను ప్రారంభించారు ప్రశాంత్ వర్మ. ‘హను–మాన్’ సినిమాకు ఇది సీక్వెల్. రామమందిరంలో బాలరాముడు ప్రాణప్రతిష్ట జరుపుకున్న సమయంలో ‘జై హను–మాన్’ సినిమాను ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు ప్రశాంత్ వర్మ.
అయితే ‘జై హనుమాన్’ సినిమా పెద్ద స్కేల్లో రూపొందనుంది. దీంతో ‘జై హనుమాన్’ సినిమాలో రాముడి పాత్రలో ఎవరు కనిపిస్తారు. హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తారు? అనే ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది.