HanuMan Review: ‘కార్తికేయ 2’, ‘కాంతార’ వంటి సినిమాలు ఆథ్మాత్మిక అంశాలతో మిళితమై ఉన్న కమర్షియల్ అంశాలు. ఈ కోవలో తెలుగులో రూపొందిన ‘హను–మాన్’ (HanuMan Review) సినిమాపై మొదట్నుంచి అంచనాలు ఉన్నాయి. ‘జాంబీరెడ్డి’ వంటి ప్రయోగాత్మక హిట్ తీసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజా సజ్జాల కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాను గురించి ఇండస్ట్రీలోనూ చర్చనీయాంశమైంది. మరి..‘హను–మాన్’ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? రివ్యూలో చది వేద్దాం.
కార్తీకేయ 2..కాంతార…హను–మాన్
సినిమా: హను–మాన్
ప్రధాన తారాగణం: తేజా సజ్జా, అమృతా అయ్యర్, వినయ్‌రాయ్, రాజ్దీపక్ శెట్టి, సముద్రఖని, గెటప్ శీను, వెన్నెల కిశోర్
దర్శకుడు: ప్రశాంత్ వర్మ
నిర్మాత: కె.నిరంజన్‌రెడ్డి
కెమెరా: శివేంద్ర దాశరథి
విడుదల: జనవరి 12, 2024.
కథ:
అంజనాద్రీలో అమ్మానాన్నలేని ఆకతాయి కుర్రాడు హనుమంతు (తేజా సజ్జా). అతని అక్కయ్య అంజమ్మ (వరలక్ష్మీ శరత్‌కుమార్). స్నేహితుడు కాశీ(గెటప్ శీను). మీనాక్షీ(అమృతా అయ్యర్) ని ప్రేమిస్తుంటాడు హనుమంతు. కానీ మీనాక్షీకి హనుమంతుపై మొదట్లో అంత మంచి అభిప్రాయం ఉండదు. అదే సమ యంలో అంజనాద్రీలో ఉన్న పాలేగాడు వ్యవస్థ అక్రమాలను, నాయకుడు గజపతిని ఎదురిస్తుంది మీనాక్షీ. దీంతో మీనాక్షీపై ఏటాక్ చేయిస్తాడు గజపతి (రాజ్దీపక్) .ఈ క్రమంలో మీనాక్షీని చీకట్లో అడవిలో రక్షిస్తాడు హను మంతు. కానీ ఈ దాడిలో బందిపోట్లు హనుమంతుని తీవ్రంగా కొడతారు. ఈ క్రమంలో నీటిలో పడి పోతాడు హనుమంతు. సముద్రంలో పడిన తర్వాత అతనికి అపూర్వమైన శక్తులు ఉన్న రుధిరమణి దొరుకుతుంది. ఈ మణి ప్రభావంతో హనుమంతు నేచురల్ సూపర్‌హీరో అవుతాడు. మరోవైపు సూపర్ హీరో కావాలని చిన్నప్పట్నుంచి కలలు కంటుంటాడు మైఖేల్. తనకు అడ్డు చెబుతున్నారని అమ్మానాన్నలను కూడా చంపుతాడు మైఖేల్. ఆ తర్వాత సూపర్‌హీరో సూట్‌ను ధరించి కొన్ని అసాధారణ కార్యక్రమాలు చేస్తాడు. కానీ సూట్ లేకుండా సూపర్‌హీరో కావాలనుకుంటాడు మైఖేల్. ఇందుకు కావాల్సిన శక్తి ఎక్కడుంది? అని వెతుకుతున్న మైఖేల్‌కు రుధిరమణి గురించి తెలుస్తుంది. రుధిరమణి కోసం అంజనాద్రీ వస్తాడు. మరి..మైఖేల్ కుట్రను హనుమంతు ఏ విధంగా కనిపెడతాడు? తనను రక్షించింది హనుమంతే అని మీనాక్షీ ఎలా నమ్ముతుంది? ఓ దశలో రుధిరమణిని హనుమంతు ఎందుకు వద్దనుకుంటాడు? హను మంతుకు కోటి(వానరం) ఏ విధంగా సహాయం చేస్తాడు? అన్న ఆసక్తికరమైన అంశాలు సినిమాలో చూడాలి.
విశ్లేషణ
సింపుల్‌గా చెప్పాలంటే….చెడుపై మంచి గెలవడమే ఈ సినిమా కథ. సాధారణ కథ. సూపర్‌హీరో కావాల నుకున్న ఓ వ్యక్తి, అనుకోకుండ నిజంగానే సూపర్‌హీరో అయిన వ్యక్తుల కథ. కథ మేజర్‌గా అంజనాద్రీలో సాగినా, మొదలైయ్యేది మాత్రం ముంబైలోని మైఖేల్ పాత్ర ఎపిసోడ్స్‌తో. దీనికి ముందు ఓ సాంగ్ వస్తుం ది. ఇందులో రుధిరమణిని గురించిన ప్రస్తావనను కథగా చెబుతారు దర్శకుడు. మైఖేల్ ఎపిసోడ్ పూర్తయిన తర్వాత అంజనాద్రీని, అక్కడి పాత్రలను పరిచయం చేస్తూ దర్శకుడు కథ చెబుతాడు. ఇలా మొదటి ఇరవై నిమిషాలు కథ నింపాదిగా సాగుతుంది. ఎప్పుడైతే మీనాక్షీపై దాడి జరగడం, హనుమంతునికి శక్తులు రావడం వంటి అంశాలతో కథలో వేగం మొదలైనట్లు అనిపిస్తుంది. కానీ కాశీ, అంజమ్మ, మీనాక్షీల దగ్గర తనకు సూపర్‌హీరో శక్తులు ఉన్నాయని హనుమంతు నిరూపించుకునే సన్నివేశాలతో ప్రీ ఇంట్రవెల్వరకు కథ సాగుతుంది. ఈ సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉంటాయి. ముఖ్యంగా కాశీ, హనుమంతుల మధ్య వచ్చే సీన్స్. అలాగే మీనాక్షీ, గుణ్ణేశ్వరరావు (సత్య) మధ్య సీన్స్ కూడా ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. హనుమంతుని దగ్గర శక్తులు ఉన్నాయని మైఖేల్ తెలుసుకోవడంతో ప్రధమార్థం ముగుస్తుంది. ఇలా తొలిపార్ట్ అంతా ఫన్నీగా ఉంటుంది. కానీ సెకండాఫ్ మొదలవగానే ఓ సీరియస్ నెస్ మొదలువుతుంది కథలో. హనుమంతు, మైఖేల్‌ల మధ్య మైండ్‌గేమ్ కనిపిస్తుంది. అలాగే హనుమంతు–అంజమ్మల మధ్య ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకు లను కంటతడి పెట్టిస్తాయి. ఇక దర్శకుడు క్లైమాక్స్‌ను డిజైన్ చేసిన విధానం రోటీన్‌గా ఉన్నా, ట్రీట్మెంట్ కాత్తగా ఉంటుంది. ట్విస్ట్‌తో ‘హను–మాన్’ పార్టు 2 ‘జై హను–మాన్’కు లీడ్ ఇవ్వడం సీన్స్ అయితే ఫుల్ ఎలివేషన్ అంతే.
#JaiHanuman will Release on 2025#HanumanReview #HanumanOnJan12th pic.twitter.com/zdbXiaTzKw
— TollywoodHub (@tollywoodhub8) January 11, 2024
ఎవరు ఎలా చేశారంటే..
‘హను–మాన్’ కోసం తేజా సజ్జా పడిన కష్టం స్క్రీన్‌పై తెలుస్తుంది. యాక్టర్‌గా కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాడనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్, సెకండాఫ్‌లోని ఎమోషన్, యాక్షన్ సీన్స్, అండర్‌వాటర్ సీన్లో తేజా ఎక్స్ప్రెషన్స్ ఇందుకు నిదర్శనాలు. హనుమంతు పాత్రకు ప్రశాంత్‌నీల్ ఇచ్చిన ఎలివేషన్‌తో కొంత స్వాగ్ కూడా కొన్ని సీన్స్‌లో తేజాకు వచ్చిదనిపిస్తుంది. యాక్టర్‌గా ‘హను–మాన్’తో తేజా సజ్జా మరో మెట్టు ఎక్కాడనడంలో ఏ మాత్రం సందేహాం లేదు. ఇక ఈ సినిమాకు ఆయువుపట్టులా నిలిచింది ప్రశాంత్ పనితనం. కథలో కాదు. టెక్నికల్‌గా ఈ సినిమాను బాగా తీశాడు ప్రశాంత్‌వర్మ. క్లైమాక్స్ సీన్స్ ప్రశాంత్‌వర్మ ప్రతిభను చూపిస్తాయి. ఓ సాధారణ కథను ప్రేక్షకులకు ఆసక్తికరంగా చూపించాడు. అంతే కాదు..20కోట్ల రూపాయల బడ్జెట్‌తోనే ఇంతపాజిటివ్ అవుట్‌పుట్‌ను తీసుకు రావడంలో ప్రశాంత్ ప్రతిభను మెచ్చుకోవాల్సిందే. మీనాక్షిగా అమృతా అయ్యర్ ఫర్వాలేదనిపించింది. మైఖేల్‌గా వినయ్‌రాయ్ మంచి రోల్ చేశాడు. హనుమంతు స్నేహితుడిగా గెటప్శీనుకు, మైఖేల్ అసిస్టెంట్ సైంటిస్ట్ సిరివెన్నెలగా వెన్నెల కిశోర్‌కు మంచి రోల్స్ పడ్డాయి. ఇక ఫస్టాఫ్‌కే పరిమితమైన మరో హాస్యనటుడు సత్య ఓకే అనిపిస్తాడు. ఇక సముద్రఖని పాత్ర సినిమాలో సైలెంట్‌గా ఉన్నా పవర్‌ఫుల్‌గా, కథను మలుపుతిప్పేదిలా ఉంటుంది. ఆయన పాత్రలోని ట్విస్ట్ క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు ఓ సర్ప్రైజ్. ఇక కెమెరామెన్ శివేంద్ర తన ప్రతిభను మరోసారి చూపించారు. ఆర్ఆర్, మ్యూజిక్ అదిరిపోయాయి. అవకాయ. .ఆంజనేయ సాంగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగుంది. అయితే కథలో నెక్ట్స్ మూమెంట్ ఏంటో ఆడియన్స్‌కు తెలిసి పోతుంటుంది. హీరోకు విలన్‌కు మధ్య ఉండే మైండ్‌గేమ్ రోటిన్‌గా ఉంటుంది. ఇది కాస్త ఎఫెక్టివ్‌గా ఉంటే బాగుండేది. హీరో చిక్కుల్లో పడ్డ ప్రతిసారి సముద్రఖని పాత్ర వచ్చి కాపాడుతుంటుంది. ఎందుకో ప్రాఫర్ రీజన్‌ను ఎస్టాబ్లిష్ కాదు. అంజనాద్రీలో ఎలక్షన్ హడావిడి హఠాత్తుగా సైలెంట్ అవుతుంది. ఇలా కొన్ని చిన్న చిన్న మైనస్‌లు ఉన్నా కూడా ఎక్కువగా ఉన్న ఫ్లస్ పాయింట్స్ వీటిని కవర్ చేస్తాయి. ఆడియన్స్‌ను అలరిస్తాయి. మన శక్తికి మించి మంచి కోసం కష్టపడితే సూపర్‌హీరో అవుతారు అనే డైలాగ్ సినిమాలో
ఉంటుంది. ప్రశాంత్‌వర్మ, తేజా సజ్జా, నిర్మాత కె. నిరంజన్‌రెడ్డి తమ శక్తికి మంచి ఈ సినిమా విషయంలో సూపర్హీరోస్గా నిలిచారు.
ఫైనల్‌గా..సూపర్‌హిట్ హను–మాన్ (3/5)