Teja Sajja: తేజా సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన మైథలాజికల్ ఫ్యాంటసీ సూపర్ హీరో డ్రా మా ‘హను–మాన్’. కె. నిరంజన్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇంకా థియేటర్స్‌లో విజయవంతంగా ప్రదర్శించ బడుతోంది. అయితే ‘హను–మాన్’ సినిమాను గురించి తేజా సజ్జా ఇటీవల ఓ ఇంటర్యూ్యలో కొన్ని ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నారు. ఆ విశేషాలు…ఇలా……
ఏడాదికి ఏడు సినిమాల అవకాశాలు వదులుకున్నాను: తేజా సజ్జా
‘హను–మాన్’ సినిమా కోసం రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డాం. నా కెరీర్ ప్రైమ్ టైమ్ ఇది. కానీ సినిమాపై నమ్మకంతో మరో సినిమా ఏదీ ఒప్పుకోలేదు. ఈ సమయంలో నాకు ఏడాదికి ఏడు సినిమాల చొప్పున అవకాశాలు వచ్చాయి. అన్నీ మంచి అవకాశాలే. ఒప్పుకోదగ్గ దర్శక–నిర్మాతలు చెప్పిన కథలే. కానీ నా నుంచి విడుదల అయ్యే నా తర్వాతి సినిమా ‘హను–మాన్’యే కావాలనుకున్నాను. అందుకే ఏ సినిమాను ఒప్పుకోలేదు. ఏదైనా ఓ సినిమాను ఒప్పుకుని, ఆ సినిమా ప్రభావం ‘హను–మాన్’ పై పడటం నాకు ఇష్టం లేదు. అందుకే ఒప్పుకోలేదు.
కంటికి ప్రమాదమని డాక్టర్ చెప్పారు: తేజా సజ్జా
‘హను–మాన్’ సినిమాలోని ‘ఆంజనేయ..అవకాయ’ పాటతో చిత్రీకరణ ప్రారంభించాము. ఈ పాటలో నా భుజంపై సుమారు వంద కేజీల వ్యక్తిని మోయాల్సి వచ్చింది. మరుసటి రోజు నా భుజం వీపరితీమైన నొప్పి. షూటింగ్‌కు వెళ్లలేదు. ఈ విషయం ప్రశాంత్‌కు చెప్పాను. మనది చిన్న సినిమాని, కాబట్టి సెట్, ఇతరుల కాల్షీట్స్ వృథా కాకూడదనన్నారు. నాకు సంబంధం లేని సన్నివేశాల చిత్రీకరణ చేస్తామన్నారు. నేను సరే అన్నాను.
‘హను–మాన్’ సినిమాలో రుధిరమణి చూసిన ప్రతిసారి నా కళ్లు మరింత రెడ్‌గా కనిపిస్తాయి. ఇందుకోసం నేను లెన్స్ వాడాం. నా కళ్లకు కాస్త ఇబ్బందిగా అనిపించడంతో కళ్ల డాక్టర్ని సంప్రదించాను. ఏవైనా లెన్స్ వాడుతున్నారా? అని అడిగారు. మీ కంటిలోని కార్నియా దెబ్బతింటోంది. ఇకపై లెన్స్‌ను వాడకండి. అలాగే గ్లిజరిన్‌ను ఉపయోగించకపోవడం మంచిది అని చికిత్సలో భాగంగా సలహాలు చెప్పారు. కానీ నేను సినిమా కోసం అవి ఏమీ పాటించలేదు. చెప్పాలంటే బాటిల్స్ బాటిల్స్ గ్లిజరిన్ వాడాల్సి వచ్చింది. అలాగే క్లైమాక్స్‌లో నేను గాలిలో తేలే సన్నివేశం ఉంది. ఆ సీన్ కోసం నేను రోప్స్ సాయంతో ఐదు రోజులు గాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అడవిలో నేను షూట్ చేస్తున్నప్పుడు ఓ సారి నన్ను పాము కాటు వేయబోయింది. తృటి లో తప్పించుకున్నాను. ఆ హనుమంతులవారు సముద్రాన్ని దాటినట్లు, మేం ఎన్నో కష్టాలు దాటి ఈ సినిమాను పూర్తి చేశాం.