ఆథ్యాత్మిక అంశాలుతో మిళితమైన కమర్షియల్ సినిమాల పట్ల ప్రేక్షకులు మంచి ఆసక్తిని కనబరుస్తున్నారు. నిఖిల్ హీరోగా వచ్చిన ‘కార్తీకేయ 2’ భాషపరమై హద్దులు దాటి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా హిందీ బాక్సాఫీస్ తుక్కురేగొట్టి నిఖిల్‌ను పాన్ ఇండియా స్టార్‌ని చేసింది. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించారు.
ఆ తర్వాత సేమ్..కన్నడ యాక్టర్ రిషబ్‌శెట్టి ఈ కోవలోనే కాంతార తీశారు. బాక్సాఫీస్ బెండు తీశారు. వసూళ్ల వర్షం కురిసింది. కన్నడ, తెలుగు, హిందీ అన్న భాషాబేధాలు లేకుండా 500 కోట్ల రూపాయాల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. హోంబలే ఫిలింస్ ఈ సినిమాను నిర్మించింది. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రీక్వెల్‌ను తీసే పనిలో ఉన్నారు రిషబ్‌శెట్టి.
Rishabshetty Kantara: అంచనాలకు విభిన్నంగా ఆలోచించాం: రిషబ్‌శెట్టి
తెలుగు యువ హీరో తేజా సజ్జా నటించిన తాజా చిత్రం ‘హను–మాన్’ కూడ కాంతార, కార్తికేయ2 స్థాయిలో భారీ హిట్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీజర్, ట్రైలర్,సాంగ్…ఇలా సినిమా నుంచి ఏ కంటెంట్ రిలీజైన అది ఆడియన్స్‌కు నచ్చేలా, ఆసక్తిని కలిగించేలా ఉంటోంది. జనవరి 12న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. భారతీయ భాషలతో పాటు జపాన్, చైనా…వంటి విదేశీ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె. నిరంజన్‌రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించగా, వినయ్‌రాయ్, వరలక్ష్మీశరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు.
హను–మాన్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల అవుతోంది. అయితే ఈ సంక్రాంతి సందర్భంగానే మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’, రవితేజ ‘ఈగిల్’, వెంకటేష్ ‘సైంథవ్’, నాగార్జున ‘నా సామిరంగ’ సినిమాలు విడుదలకు సిద్ధమౌతున్నాయి. అనువాదంగా రజనీకాంత్–విష్ణువిశాల్‌ల ‘లాల్‌సలామ్’, ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’, శివకార్తీకేయన్ అయాలాన్ సినిమాలు రెడీ అవుతున్నాయి. అయితే ‘హను–మాన్’లోని ఆథ్మాత్మిక అంశం ఏ మాత్రం ఆడియన్స్‌కు టచ్ అయిన మిగతా సంక్రాంతి సినిమాలకు ‘హను–మాన్’ గట్టి పోటీని స్తుందనడంలో ఏ మాత్రం సందేహాం లేదు.