రిషబ్‌శెట్టి హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘కాంతార’. మైథలాజికల్ టచ్‌తో తెరకెక్కిన ఈ సినిమా 2022, సెప్టెంబరు 30న విడుదలై కన్నడలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కొంతగ్యాప్ తర్వాత తెలుగులో కూడా విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ‘కాంతార’ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రేక్షకులు ఊహించారు. కానీ ప్రీక్వెల్ కథను రెడీ చేసి, ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు రిషబ్‌శెట్టి. ‘కాంతార’ ప్రీక్వెల్‌ను గురించి రిషబ్ శెట్టి మాట్లాడారు.
సీక్వెల్ అనుకున్నారు..మేం ప్రీక్వెల్ ప్లాన్ చేశాం
‘‘కాంతార’ సినిమా విడుదలకు ముందే సీక్వెల్ ఉంటుందని ప్రేక్షకులు ఊహించారు. కాంతార విడుదలై, బ్లాక్‌బస్టర్ సాధించిన తర్వాత ఈ అంచనాలు మరింత పెరిగాయి. సీక్వెల్ కచ్చితంగా వస్తుందనుకున్నారు. అయితే మేం విభిన్నంగా ఆలోచించాము. ‘కాంతార’ ప్రీక్వెల్‌ను తీయాలనుకున్నాం. ఈ విషయాన్ని నిర్మాత విజయ్‌తో చర్చించుకుని ఫైనల్‌గా ఒకే చేసుకున్నాం.
ఈ నెలాఖర్లో షూటింగ్ ప్రారంభిస్తాం
‘కాంతార ఏ లెజెండ్:ఛాప్టర్1’ సినిమా ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా రూపొందుతుంది. ఇది ప్రాచీన కదంబ రాజవంశానికి చెందిన కథ. కుందాపూర్‌లోని ఆనెగడ్డ దేవాలయంలో ముహూర్తపు సన్ని వేశాన్ని ఇప్పటికే చిత్రీకరించాము. ఈ సినిమా స్క్రిప్ట్, సంభాషణలు, ప్రొడక్షన్‌ను మూడునెలల్లోనే సిద్ధం చేసుకున్నాం. ఈ నెల చివరివారంలో కర్ణాటక తీరప్రాంతంలో మొదటి షెడ్యూల్ షూటింగ్‌ను స్టార్ట్ చేస్తాం. కన్నడంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చెప్పుకొచ్చారు.