నాగార్జున(Nagarjuna) హీరోగా చేస్తున్న ప్రస్తుతం సినిమా ‘నా సామిరంగ (na saami Ranga)’. ఇది నాగార్జున కెరీర్‌లోని 99వ సినిమా. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం కానున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. అయితే నాగార్జున వందో సినిమాను గురించిన చర్చలు ఎప్పట్నుంచో జరుగుతున్నాయి. బెజవాడ ప్రసన్న కుమార్, మోహన్‌రాజా, ఇటీవల తమిళ దర్శకుడు అనిల్ అంటూ ఇలా కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తమిళ దర్శకుడు అనిల్ చెప్పిన కథకు నాగార్జున ఒకే చెప్పారని, ఈ సినిమాను తమిళ ప్రముఖ నిర్మాత ‘జ్ఞానవేల్ రాజా నిర్మిస్తారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదండోయ్..ఈ సినిమాకు ఈ సినిమాకు ‘లవ్..యాక్షన్..రొమాన్స్(ఎల్.ఏ.ఆర్) అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. అనిల్‌తో అంతా ఒకే అయితే నాగ్ వందో సినిమా ఇదే కావొచ్చు. అయినా అంతా అనుభవంలేని కొత్త దర్శకుడితో వందో సినిమానా? అన్న డౌట్ వద్దు. నాగ్ కెరీర్లో ఎంతోమంది కొత్త దర్శకులు ఉన్నారు. ఇండస్ట్రీ పాత్ బ్రేకింగ్, కల్ట్ ఫిల్మ్‌గా చెప్పుకునే ‘శివ’ సినిమాకు దర్శకుడిగా రామ్‌గోపాల్‌వర్మకు తొలి చాన్స్ ఇచ్చింది నాగార్జున అని మర్చిపోకూడదు. అలాగే ధనుష్ హీరోగా శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో రూపొందనున్న సనిమాలో కూడా నాగార్జున ఓ కీ రోల్ చేస్తున్నారు. రణ్‌బీర్‌కపూర్ ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 2’లో నాగార్జున ఉండొచ్చు.
Nagarjuna: నాగార్జున వందో సినిమా టైటిల్ ఇదేనా?
Leave a comment
Leave a comment