VijayDevarakonda FamilyStar
విజయ్‌దేవరకొండ(VijayDevarakonda) సినిమాలంటే యూత్‌లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. విజయ్‌దేవరకొండ చిత్రాలు ‘అర్జున్ రెడ్డి’, ‘గీతగోవిదం’, ‘టాక్సీవాలా’, ‘పెళ్ళిచూపులు’ …వంటి సినిమాలు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటి ది. అయితే విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘ఫ్యామిలీస్టార్’ (FamilyStar). ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఈ చిత్రం నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్‌లు గతంలో వెల్లడించారు. కానీ ఫ్యామిలీస్టార్ సినిమాను సంక్రాంతి కి విడుదల చేయడం లేదని, మార్చిలో విడుదల చేస్తామని తాజాగా ‘దిల్’ రాజు వెల్లడించారు.
ఫ్యామిలీస్టార్ సినిమాకు సంబంధించి యూఎస్‌లో ఓ భారీ షెడ్యూల్ జరగాల్సి ఉంది. కానీ నటీనటుల వీసాల కారణంగా ఈ చిత్రం షూటింగ్ అక్కడ సాధ్యం కాలేదు. బ్యాంకాంక్‌లో ప్లాన్ చేశారు. దీనికి ముందు ఢిల్లీలోని నోయిడాలో కొంత షూటింగ్ జరిగింది. ఈ లోపు యూఎస్‌లో షెడ్యూల్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఇలా షూటింగ్ విషయంలో చిత్రంయూనిట్ కాస్త గందరగోళానికి గురికావడంతో షూటింగ్ అనుకున్నట్లుగా పూర్తి కాలేదు. ఈ లోపు ‘ఫ్యామిలీస్టార్’లో హీరోయిన్గా నటిస్తున్న మృణాళ్ఠాకూర్ హీరోయిన్గా నటించిన మరో చిత్రం ‘హాయ్ నాన్న’ డిసెంబరు 7 రిలీజ్‌కు సిద్ధమైంది. నాని హీరో. ఈ సినిమా ప్రమో షన్స్‌లో మృణాల్ పాల్గొనాల్సిన పరిస్థితి. దీంతో ఫ్యామిలీస్టార్ షూటింగ్ కాస్త ఆలస్యం.
ఇక సంక్రాంతి బరిలో ఉన్న వెంకటేష్ సయిందవ్, నాగార్జున ‘నా సామిరంగ’, రవితేజ ‘ఈగిల్’, మహేశ్‌బాబు ‘గుంటూరుకారం’, తేజా సజ్జా ‘హను–మాన్’ సినిమాలు ఉన్నాయి. వీటిలో ‘గుంటూరుకారం’తో పాటు ‘సయిందవ్’ సినిమాను కూ డా ‘దిల్’ రాజు తెలుగురాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇలా తాను డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన సినిమాలకు, తాను నిర్మించిన ‘ఫ్యామిలీస్టార్’ సినిమాకు థియేటర్స్ కేటాయింపుల విషయంలో సమస్యలు వస్తాయని ‘దిల్’ రాజు భావించారట. ఇలా ఇన్ని కారణాల నేపథ్యంలో ‘ఫ్యామిలీస్టార్’ మార్చికి షిఫ్ట్ అయ్యాడు. ఫ్యామిలీస్టార్కు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో విజయ్, పరశురామ్ కాంబోలో వచ్చిన ‘గీతగోవిందం’ అద్భుత విజయాన్ని సాధించింది.